ETV Bharat / international

కరోనా మృతుల అంత్యక్రియలకు వెయిటింగ్ లిస్ట్! - అమెరికా కరోనా కేసులు వివరాలు

కరోనా ధాటికి అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోతుంది. రోజూ కేసులు 60 వేలకు తగ్గటం లేదు. కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. గత కొద్ది రోజుల నుంచి మరణాలు తక్కువ సంఖ్యలో నమోదవుతూ వచ్చాయి. రెండు రోజుల నుంచి మళ్లీ మరణాలు పెరగటం అక్కడి అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. వైరస్​ సోకి మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

U.S.-records-over-1000-new-corona-deaths
అమెరికాలో మళ్లీ రికార్డు స్థాయి మరణాలు!
author img

By

Published : Jul 23, 2020, 1:58 PM IST

అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా తగ్గినట్టే కనిపించినా అగ్రరాజ్యంలో కొవిడ్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వరుసగా రెండోరోజు 1000కి పైగా కొవిడ్‌ మరణాలు సంభవించినట్టు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. మంగళవారం 1100లకు పైగా మరణాలు నమోదవ్వగా.. బుధవారం కూడా దాదాపు అదే స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. మే 29 తర్వాత ఇంత భారీ సంఖ్యలో మళ్లీ మరణాలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.

అంత్యక్రియలకు వెయిటింగ్‌ లిస్ట్‌!

టెక్సాస్‌లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉంది. వారం వ్యవధిలోనే మరణాలు రెట్టింపు కావడం వల్ల మృతదేహాలను రిఫ్రిజిరేటర్లలో నిల్వచేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

హిడాల్గో కౌంటీలో గత వారంలో 60శాతం కేసులు పెరిగినట్టు సమాచారం. శ్మశానవాటికలో అంత్యక్రియలకు రెండు వారాల పాటు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండటం వల్ల.. మృతదేహాలను భద్రపరిచేందుకు ఐదు రిఫ్రిజిరేటెడ్‌ ట్రక్కులను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రక్కులో 50 చొప్పున మృతదేహాలను భద్రపరుస్తున్నారు.

అమెరికాలో ఇప్పటివరకు 40,38,967 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11,99,314 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1.45లక్షల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 26,94,269 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి:195 ఏళ్లు వేచి చూస్తేనే గ్రీన్​కార్డ్ కల సాకారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.