ETV Bharat / international

అమెరికా కాంగ్రెస్​లో కొత్త బిల్లు- భారతీయ విద్యార్థులకు చిక్కులు! - ఎఫ్​-1 వీసా

అమెరికాలో నిరుద్యోగాన్ని తగ్గించి.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ' ది ఫెయిర్నెస్ ఫర్​ స్కిల్డ్​ అమెరికన్స్' అనే పేరుతో​ బిల్లును చట్టసభ ముందుకు తీసుకొచ్చారు కొందరు చట్టసభ్యులు. ఆప్షనల్​ ప్రాక్టీస్​ ట్రైనింగ్(ఓపీటీ) విధానం ద్వారా విదేశీ విద్యార్థులు అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే విధానాన్ని రద్దు చేయాలన్నారు.

US lawmakers
అమెరికా కొత్త బిల్లు
author img

By

Published : Jul 29, 2021, 12:12 PM IST

విదేశీ చదువులకు భారతీయ విద్యార్థుల తొలి గమ్యస్థానం ఏది? అని అడిగితే చాలామంది అమెరికా అని ఠక్కున చెప్తారు. కానీ రానున్న రోజుల్లో అగ్రరాజ్యంలో విదేశీ విద్యార్థులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి కనిపించటం లేదు. అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ఈ క్రమంలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలో పట్టభద్రులైన విదేశీ విద్యార్థులు.. అక్కడే ఉద్యోగాలు చేసేందుకు వీలుగా కల్పించిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ.. కొందరు చట్టసభ్యులు కొత్త బిల్లును ప్రతిపాదించారు. అమెరికా చట్టసభ ముందుకు 'ది ఫెయిర్నెస్ ఫర్​ స్కిల్డ్​ అమెరికన్స్' అనే బిల్లును తీసుకొచ్చారు.

ఇమ్మిగ్రేషన్​ అండ్​ నేషనాలిటీ చట్టాన్ని సవరించాలని కోరుతూ.. యూఎస్​ చట్టసభ సభ్యులు పాల్​ ఏ గోసార్, ఎమ్​ఓ బ్రూక్స్, ఆండీ బిగ్స్​, మాట్స్​ గేట్జ్ ఈమేరకు బిల్లు ప్రవేశపెట్టారు. ఈ చట్టంలో ఉన్న ఆప్షనల్​ ప్రాక్టీస్​ ట్రైనింగ్​(ఓపీటీ) విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ విధానం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు.

ఆప్షనల్​ ప్రాక్టీస్​ ట్రైనింగ్​(ఓపీటీ) అంటే?

విద్యార్థి (ఎఫ్​-1 ) వీసాతో అమెరికాలో డిగ్రీ/ పీజీ పూర్తిచేసిన విదేశీయులు.. పట్టభద్రులు అయ్యాక అక్కడే మూడేళ్లపాటు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు.

'స్థానిక యువత గాలికి..'

సొంత విద్యార్థులను విస్మరించి.. విదేశీ విద్యార్థులకు పలు రంగాల్లో అపార ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాలు ఉండొరాదని చట్టసభ్యుడు పాల్​ గోసర్ స్పష్టం చేశారు. అమెరికా పౌరులను పక్కనబెట్టి.. వేతనం తక్కువగా ఇవ్వొచ్చన్న కారణంగా విదేశీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించటం ఆమోదయోగ్యం కాదన్నారు. ఓపీటీ విధానం వల్ల.. అమెరికా యువత పూర్తిగా వెనుకబడ్డారని తెలిపారు. ఈ మేరకు ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ.. బిల్లుపై మొదటగా సంతకం చేశారు.

హెచ్​-1బీ నిబంధనల ఉల్లంఘన..

ఆప్షనల్​ ప్రాక్టీస్​ ట్రైనింగ్(ఓపీటీ) విధానం వల్ల.. హెచ్​-1 బీ నిబంధనలకు సైతం గండిపడిందన్నారు. ఏటా పరిమితికి మించి విద్యార్థులు అమెరికాకు తరలివస్తున్నారని గోసర్​ ఆరోపించారు. విదేశీ ఉద్యోగస్తులకు పన్నుల నుంచి విముక్తి ఉందని.. అమెరికా ఉద్యోగస్తుడి కంటే 10-15 శాతం తక్కువ వేతనానికే ఇతర దేశాల ఉద్యోగులు దొరుకుతారన్నారు.

తక్కువ వేతనాలకే..

స్టూడెంట్ ట్రైనింగ్ పేరిట.. అమెరికా ఉద్యోగులను కాదని పలు సంస్థలు తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రభుత్వ సంబంధాల అధికారి తెలిపారు. ఈ విధానం వల్ల అప్పుడే గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన అగ్రరాజ్య విద్యార్థులకు అవకాశాలు లభించటం లేదన్నారు.

ఇవీ చదవండి:

'అగ్రరాజ్యం కంటే ఎక్కువగా ఆ దేశానికే మన విద్యార్థులు'

'అమెరికా విధానాలతో కెనడాకు భారత యువత'

'హెచ్-​1బీ వీసాల జారీ రెట్టింపు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.