ETV Bharat / international

ముంచుకొస్తున్న డెడ్‌లైన్‌.. ఇంకా 300మంది అఫ్గాన్‌లోనే! - afghan crisis

అమెరికా ఇప్పటి వరకు 5,500 మంది అమెరికా పౌరులను(americans in afghanistan) అఫ్గానిస్థాన్​(Afghanistan crisis) నుంచి తరలించింది. ఆదివారం మరో 50 మందిని తరలించింది. దాదాపు 300 మంది ఇంకా ఉన్నారని.. గడువులోగా వారిని తరలించే సామర్థ్యం ఉందని అమెరికా స్పష్టం చేసింది.

US evacuates
అఫ్గాన్ ప్రజల తరలింపు
author img

By

Published : Aug 30, 2021, 6:45 AM IST

అఫ్గానిస్థాన్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో(Afghanistan crisis) అక్కడి నుంచి తమ పౌరులను తరలించే ప్రక్రియ ఆయా దేశాలకు సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ తంతును పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఇంకా దాదాపు 300 మంది అమెరికా పౌరులు(americans in afghanistan) ఉన్నట్లు సమాచారం. వీరందరినీ గడువులోగా తరలించే సామర్థ్యం తమకు ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పేర్కొన్నారు.

వీరితోపాటు అమెరికాకు సహాయం చేసిన అఫ్గాన్‌లను కూడా తీసుకెళ్తామని పునరుద్ఘాటించారు. అయితే, గడువు ముగిసిన తర్వాత అక్కడ తమ రాయబార కార్యాలయం కొనసాగించకూడదని తాము ఓ నిర్ణయానికి వచ్చినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 31 గడువు..

అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌ను తాలిబన్లు(Afghan Taliban) తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతోన్న అఫ్గాన్‌ ప్రజలు విదేశాలకు పారిపోయేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. అదే సమయంలో అక్కడ చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన మరో రాకెట్‌ దాడిలోనూ ఓ చిన్నారి మృతి చెందింది. ఈ నేపథ్యంలో స్థానికంగా శాశ్వతమైన కార్యాలయం లేకున్నా ఉగ్రవాదాన్ని అణచివేసే సామర్థ్యం తమకు ఉందని అమెరికా పేర్కొంది. ఆగస్టు 31 గడువులోగా తమ సిబ్బందిని (300 మంది) తరలిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, మరోసారి బాంబు దాడులు జరుగుతాయని పసిగట్టిన అమెరికా దళాలు.. కాబుల్‌ విమానాశ్రయానికి దూరంగా వెళ్లిపోవాలని అమెరికా పౌరులకు సూచించాయి.

అమెరికా సేనలకు అధ్యక్షుడు నివాళి..

కాబుల్‌ ఎయిర్‌పోర్టు వద్ద చోటుచేసుకున్న రెండు వరుస బాంబుపేలుళ్లలో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా, దాడులకు పాల్పడిన ఇస్లామిక్‌ స్టేట్స్‌కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగే చోట డ్రోన్‌ దాడి చేశామని వెల్లడించింది. ఆ దాడిలో కీలకమైన ఉగ్ర నేతలు హతమైనట్లు ప్రకటించింది. ఇటువంటి దాడులను మరిన్ని కొనసాగిస్తామని అమెరికా తన మిత్ర దేశాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇక అఫ్గాన్‌లో మృతిచెందిన సైనికుల పార్థివ దేహాలు అమెరికా చేరుకోగా.. డోవెర్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు వారికి నివాళి అర్పించారు.

ప్రక్రియ కొనసాగిస్తాం..

మరోవైపు తరలింపు ప్రక్రియను కొనసాగిస్తామని జర్మనీ తెలిపింది. జర్మన్ దేశస్థులను, అఫ్గాన్​ శరణార్థులను తరలించేందుకు కట్టుబడి ఉన్నామని ఆ దేశ విదేశాంగమంత్రి హీకో మాస్ స్పష్టం చేశారు. 45 దేశాలకు చెందిన 5,347 మందిని ఇప్పటి వరకు తరలించామన్నారు.

తాలిబన్ల పాలన అంతమే..

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల పాలన ఎక్కువకాలం నిలువదని ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సాలేహ్​ స్పష్టం చేశారు. తాలిబన్ల చట్టాలను అఫ్గాన్ ప్రజలు తిరస్కరిస్తారన్నారు. పంజ్​షేర్ నేత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొంతమంది వ్యక్తుల మద్దతుతో నాయకుడిని ఎన్నుకునే విధానాన్ని తప్పుబట్టారు. ఈయూ దేశాలు పంజ్​షేర్ ప్రావిన్స్​కు మద్దతివ్వాలన్నారు.

ఇదీ చదవండి: అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు.. 2వేల మంది జర్నలిస్టులు సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.