ETV Bharat / international

ట్రంప్​ X బైడెన్​: టాప్​ 10 హైలైట్స్ - అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక పరిణామాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అధ్యక్ష పీఠానికి జో బైడెన్ కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలోనే నిలిచినా.. ట్రంప్​కు కూడా ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి. అయితే, బైడెన్​కు మార్గం సుగమం చేసిన మిషిగన్, విస్కాన్సిన్ ఓట్ల లెక్కింపుపై ఆరోపణలు చేస్తూ ట్రంప్ కోర్టుకెక్కిన నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అమెరికా ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగిన కీలక పరిణామాలు ఇవీ..

us election 2020
అమెరికా అధ్యక్ష ఎన్నికలు
author img

By

Published : Nov 5, 2020, 1:04 PM IST

Updated : Nov 5, 2020, 1:15 PM IST

అమెరికా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దాదాపు అధ్యక్ష పీఠానికి దగ్గరలోనే ఉన్నా.. ఇంకా లెక్కింపు జరుగుతున్న కారణంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కీలక పరిణామాలు ఇలా..

1. అడుగు దూరంలో బైడెన్​..

మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన బైడెన్​.. స్వింగ్​ రాష్ట్రాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుచుకోగా వెనకబడ్డారు. అయితే, కీలక రాష్ట్రాలైన మిషిగన్, విస్కాన్సిన్​​లో గెలుపొంది తిరిగి దూసుకెళ్లారు. ఇప్పటివరకు 437 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా.. బైడెన్ 264 గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్​కు అడుగు దూరంలో నిలిచారు. ట్రంప్ 214 సీట్లు దక్కించుకున్నారు.

2. తేలాల్సిన లెక్కలివే..

పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలైనా, నెవడా, అలస్కా రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 60 ఎలక్టోరల్​ ఓట్లు ఉన్నాయి. వీటిల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్న 4 రాష్ట్రాల్లో 54 ఓట్లు ఉండగా.. బైడెన్​ ముందంజలో ఉన్న నెవడాలో 6 ఓట్లు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలను గెలుచుకోగలిగితే ట్రంప్ మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది.

3. ఈ నెల 12 వరకు లెక్కింపు!

అమెరికా ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఈ నెల 12 వరకు కొనసాగనుంది. నార్త్ కరోలినాలో ఈ నెల 6 నుంచి 12 వరకు పోస్టల్ బ్యాలెట్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుంది.

4. కోర్టుకెక్కిన ట్రంప్..

మొదట మిషిగన్, విస్కాన్సిన్​లో ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించగా.. వాటిని బైడెన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలపై డొనాల్డ్ ట్రంప్ బృందం కోర్టులను ఆశ్రయించింది. పెన్సిల్వేనియా, మిషిగన్​లో లెక్కింపు నిలిపేసి.. నిపుణులైన పరిశీలకులను నియమించాలని కోరింది. విస్కాన్సిన్​లో రీకౌంటింగ్ చేపట్టాలని అభ్యర్థించింది.

5. నిధుల సేకరణలో..

న్యాయపరమైన అవరోధాలు ఎదురుకాకుంటే అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోబోయేది ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలేది. అయితే, ట్రంప్ కోర్టుకెక్కిన నేపథ్యంలో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యాయపోరాటానికి అవసరమైన నిధుల సేకరణలో ట్రంప్, బైడెన్ వర్గాలు తలమునకలయ్యాయి.

6. నిరసనలు..

ఫలితాలపై స్పష్టత రాకపోవటం, న్యాయపోరాటానికి ట్రంప్ సిద్ధమైన వేళ అమెరికాలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ప్రతి ఓటు లెక్కించాలని, ట్రంప్ వెళ్లిపోవాలనే డిమాండ్‌తో ర్యాలీ తీయగా... ట్రంప్ అనుకూల వర్గం అక్రమ ఓట్లు లెక్కించవద్దంటూ కొన్ని చోట్ల నిరసనలకు దిగింది.

7. చట్టసభల ఫలితాలూ..

అధ్యక్ష ఎన్నికల తరహాలోనే చట్టసభల్లోనూ అనిశ్చితి నెలకొంది. మొత్తం 435 స్థానాలున్న దిగువ సభలో.. ఇప్పటివరకు డెమొక్రాట్లు 192 స్థానాల్లో గెలుపొందగా, రిపబ్లికన్లు 185 స్థానాలను దక్కించుకున్నారు. మొత్తం 218 స్థానాలు అవసరమైన నేపథ్యంలో ఇక్కడా ఆసక్తికరమైన పోరు నడుస్తోంది.

8. భారతీయుల హవా..

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు దుమ్మురేపారు. గత ఫలితాలను పునరావృతం చేస్తూ.. ప్రతినిధుల సభకు నలుగురు ఎన్నికయ్యారు. రాష్ట్ర చట్ట సభల్లోనూ ఐదుగురు మహిళలు సహా 12 మందికిపైగా ఎన్నికయ్యారు. నలుగురు అభ్యర్థులు ఓటమితో సరిపెట్టుకున్నారు.

9. రికార్డు పోలింగ్...

అమెరికా ఎన్నికల్లో 120 తర్వాత భారీగా పోలింగ్‌ నమోదైంది. అగ్రరాజ్యంలో ఓటర్ల సంఖ్య 23.9 కోట్లు కాగా.. తాజా ఎన్నికల్లో 66.9 శాతం ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తాజా ఎన్నికల్లో 10 కోట్ల మందికిపైగా ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

10. చరిత్ర సృష్టించిన బైడెన్..

అమెరికాలో ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లను ఆర్జించి బైడెన్‌ చరిత్ర సృష్టించారు. అత్యధిక పాపులర్​ ఓట్లను సాధించిన అభ్యర్థిగా నిలిచారు. 2008లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పొందిన 6.94 కోట్ల రికార్డును బద్దలు కొట్టారు.

ఇవీ చూడండి:

Last Updated : Nov 5, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.