ETV Bharat / international

కరోనా పరీక్షల్లో భారత్​కు, అమెరికాకు ఇంత తేడానా? - america corona cases

అమెరికా ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనాపై పోరాటంలో పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఇప్పటి వరకు భారత్​ సహా 10 దేశాల కంటే అత్యధికంగా 4.18 మిలియన్ల మందికిపైగా కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. దేశ ప్రజలను సురక్షితంగా ఉంచే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

US COVID-19 tests more than India, 9 others combined: Trump
'ప్రపంచంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించింది మేమే'
author img

By

Published : Apr 20, 2020, 11:36 AM IST

కరోనాను కట్టడి చేసే విషయంలో అమెరికా దూకుడుగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే భారత్​ సహా 10 దేశాల కంటే అత్యధికంగా 4.18 మిలియన్ల మందికిపైగా కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

"మేము ప్రపంచ దేశాలకంటే ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించాం. ముఖ్యంగా ఫ్రాన్స్​, బ్రిటన్​, దక్షిణ కొరియా, జపాన్​, సింగపూర్​, భారత్​, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, స్వీడన్​, కెనడా దేశాలతో పోలిస్తే మేము చేసిన పరీక్షలు అధికం."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

50 శాతం తగ్గిన కేసులు...

ఇప్పటివరకు అమెరికాలో 40 వేల మందికిపైగా కరోనాకు బలయ్యారు. సుమారు 7లక్షల 64వేల మందికి ఈ మహమ్మారి సోకింది. వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్​లో 2లక్షల 42వేల కేసులు నమోదు కాగా.. 17 వేలకుపైగా మృత్యువాత పడ్డారు. అయితే గత ఎనిమిది రోజుల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 50 శాతం తగ్గినట్లు ట్రంప్​ పేర్కొన్నారు.

మీ రక్షణ మా బాధ్యత...

ఇటలీ, స్పెయిన్​ దేశాలు మొదట లాక్​డౌన్​ ప్రకటించడంలో ఆలస్యం చేసినందు వల్ల.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నారు ట్రంప్. తమ దేశంలోనూ భౌతిక దూరం పాటించకపోయినట్లైతే లక్షలాది మంది చనిపోయేవారని పేర్కొన్నారు.

ప్రస్తుతం అమెరికాలో 95శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనా వైరస్​ పుట్టుకపై దర్యాప్తు

వైరస్​కు కేంద్ర బిందువైన వుహాన్​లో కరోనా వైరస్​పై దర్యాప్తు చేపట్టేందుకు నిపుణుల బృందాన్ని చైనాకు పంపించే యోచనలో ఉన్నట్లు ట్రంప్​ తెలిపారు. ఈ మహమ్మారిని ప్లేగు వ్యాధితో పోల్చిన ట్రంప్​.. చైనాలో అసలేం జరుగుతుందో నిగ్గు తేల్చాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.