ETV Bharat / international

ట్రంప్​ కీలక నిర్ణయం- హెచ్​-1బీ వీసాల నిలిపివేత - H-1B visas latest news

వేలాది మంది భారతీయుల కలల్ని నీరుగార్చే నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. హెచ్​-1బీ వీసాలు సహా ఇతర తాత్కాలిక ఉపాధి వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ ప్రకటన జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేయనున్నారని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు.

Trump to issue temporary suspension of H-1B
హెచ్​1బీ వీసాల రద్దు డిసెంబర్​ 31 వరకు పొడిగింపు
author img

By

Published : Jun 23, 2020, 5:02 AM IST

Updated : Jun 23, 2020, 7:15 AM IST

అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో తాత్కాలికంగా పని చేయడానికి అవసరమయ్యే హెచ్‌-1బీ, ఎల్‌- 1 తదితర వీసాలపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కీలక‌ నిర్ణయం తీసుకున్నారు. హెచ్​-1బీ సహా వివిధ తాత్కాలిక ఉపాధి వీసాలను ఈ ఏడాది చివరి వరకు (డిసెంబర్​ 31, 2020) నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేస్తారని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. తాజా నిర్ణయం అమెరికాలోకి వలసలను నిరోధిస్తుందని తెలిపారు.

కరోనా సంక్షోభం కారణంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అమెరికన్లకు అవకాశాలు కల్పించాలనే ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు అధికారులు. అయితే.. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు.

తాజా ఆంక్షలు.. హెచ్-​1బీతో పాటు తాత్కాలిక ఉపాధి వీసాలు హెచ్​-2బీ, జే-1, ఎల్​-1 వీసాలకు కూడా వర్తిస్తాయని తెలిపారు అధికారులు. ప్రస్తుత నిర్ణయం తాత్కాలికమే అయినా.. అమెరికా వీసా జారీ వ్యవస్థలో సంస్కరణలతో శాశ్వత మార్పులు ఉంటాయన్నారు. కేవలం నైపుణ్యవంతులే అమెరికాలో కాలుపెట్టేలా కొత్త నిర్ణయాలు ఉండొచ్చని చెప్పారు.

భారతీయులపైనే అధిక ప్రభావం...

అమెరికా ఏటా 85 వేల హెచ్-​1బీ వీసాలు జారీ చేస్తోంది. వీటిలో దాదాపు 70 శాతం భారతీయ ఐటీ నిపుణులకే దక్కుతాయి. ట్రంప్​ తాజా నిర్ణయం వీరిపై ప్రభావం చూపనుంది.

ఇదీ చూడండి: 'ఆ లెక్కన చూస్తే భారత్​లో కేసులు అత్యల్పమే'

Last Updated : Jun 23, 2020, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.