ETV Bharat / international

డ్రగ్స్ అక్రమ​ రవాణా దేశాల జాబితాలో భారత్​: ట్రంప్​ - coca cultivation

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి నోరు పారేసుకున్నారు. డ్రగ్స్​ సరఫరా చేసే 20 దేశాల జాబితాలో భారత్​ను కూడా చేర్చారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు అమెరికా పోరాటం చేస్తుందని అన్నారు. డ్రగ్స్​ వాడకం నియంత్రణలో బొలీవియా, వెనిజువెలా విఫలమయ్యాయని మండిపడ్డారు డొనాల్డ్​.

Trump identifies India, 20 other nations as major drug transit or major illicit drug-producing countries
డ్రగ్స్ అక్రమ​ రవాణా దేశాల జాబితాలో భారత్​: ట్రంప్​
author img

By

Published : Sep 17, 2020, 4:37 PM IST

మాదక ద్రవ్యాలు సరఫరా, అక్రమంగా రవాణా చేసే దేశాల జాబితాలో భారత్​ను చేర్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. బహమాస్​, అఫ్గానిస్థాన్​, కొలంబియా, బర్మా, కోస్టా రికా, పెరూ ఇలాంటి 20 దేశాల్లో భారత్​ కూడా ఉందని అన్నారు.

డ్రగ్స్​ కార్యకలాపాలతో సంబంధమున్న నేరపూరిత సంస్థలను విడిచిపెట్టేది లేదని ట్రంప్​ ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారి కట్టడిలో అమెరికా తన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక ఒప్పందాలకు అనుగుణంగా.. బొలీవియా, వెనిజువెలా తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు ట్రంప్. డ్రగ్స్​ నియంత్రణ కోసం ఈ దేశాలు చర్యలేవీ తీసుకోలేదని మండిపడ్డారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్​ మదురోనే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు ట్రంప్​. ఆయనను ఓ నియంతగా పేర్కొన్నారు.

'కోకా సాగు పెరిగిపోతోంది'

దీర్ఘకాలంగా అమెరికా మిత్ర దేశాలైన కొలంబియా, పెరూను ఈ జాబితాలో చేర్చింది అగ్రరాజ్యం. పోలీసులు, సాయుధ దళాలు.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నప్పటికీ కొలంబియాలో కోకా(మత్తు పదార్థం) సాగుకు అడ్డుకట్ట పడటం లేదని ట్రంప్​ అన్నారు.

పెరూలో కోకా సాగు, కొకైన్​ ఉత్పత్తి రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు​. ఈ దేశాల్లో డ్రగ్స్​ నియంత్రణకు అమెరికా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

మెక్సికోకు హెచ్చరిక..

తమ భూభాగంలో విస్తృతంగా ఉత్పత్తి అవుతోన్న ఫెంటనైల్​ వాడకాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని మెక్సికో ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు. మాదక ద్రవ్యాల ముఠాలతో బెదిరింపులకు గురవుతోన్న అమెరికా, మెక్సికన్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.