కరోనా వైరస్ బ్రెజిల్లో విజృంభిస్తోంది. రోజూ వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సావో పాలో నగరంలోని విలా ఫార్మోసా శ్మశానంలో 13,000 సమాధులను ఇప్పటికే సిద్ధం చేశారు.
వైరస్ బాధితులను సామూహికంగా ఖననం చేస్తున్నారు. అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వైరస్ను తేలిగ్గా తీసుకోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చైనా కంటే ఎక్కువగా అక్కడ కేసులు, మృతులు నమోదవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
![brazil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7019754_brazil.jpg)
ఎక్కువమందిలో స్వల్ప, తక్కువ వ్యాధి లక్షణాలు కన్పిస్తున్నాయని సమాచారం. వృద్ధుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
![brazil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7019754_sao-paulo.jpg)
![brazil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7019754_sao.jpg)
![brazil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7019754_brazil.jpg)
![brazil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7019754_brazill.jpg)
ఇదీ చూడండి: 'విద్యార్థులు, వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు'