ETV Bharat / international

మొబైల్​ సాయంతో అరగంటలో కరోనా పరీక్ష ఫలితం - చరవాణితో 30 నిమిషాల్లో కరోనా ఫలితం

సెల్​ఫోన్​ సాయంతో 30 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితాన్ని తెలుసుకునే ఓ పరికరాన్ని తయారు చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. దీని వల్ల వైరస్​ నమూనాను ల్యాబ్​కు తీసుకెళ్లకుండా ఫలితం తెలుసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను పీఎన్​ఏఎస్​ మ్యాగజైన్​లో ప్రచురించారు.

Scientists develop portable, point-of-care COVID-19 test
ఇకపై చరవాణీతో కరోనా పరీక్ష ఫలితం
author img

By

Published : Sep 1, 2020, 6:09 PM IST

కరోనా పరీక్షకు నమూనాను ఇచ్చిన తర్వాత ఫలితం రావటానికి రెండు, మూడు రోజులు పడుతోంది. వైద్య సిబ్బంది కొరతే దీనికి కారణం. అయితే ఎవరి సాయం లేకుండా స్వతహాగా కరోనా పరీక్ష చేసుకునే పోర్టబుల్​ పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పరికరాన్ని సెల్​ఫోన్​కు అనుసంధానం చేసి 30 నిమిషాల్లో ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి ఉండటం విశేషం. దీనికి సంబంధించి పూర్తి నివేదికను పీఎన్​ఏఎస్​ మ్యాగజైన్​లో ప్రచురించారు.

సాధారణంగా వైద్యసిబ్బంది స్వాబ్​ టెస్ట్​ చేసి దానిని ప్రత్యేక రవాణా మార్గం ద్వారా ల్యాబ్​కు పంపిస్తారు. అక్కడి నిపుణులు నమూనాను పరీక్షించి వైరస్​ నిర్ధరణ చేస్తారు. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతున్నందున కొత్త పరికరాన్ని రూపొందించినట్లు తెలిపారు.

ఆర్​టీ పీసీఆర్​ టెస్ట్​ను పరీక్షించటానికి ప్రత్యేక పరికరాలు, నిపుణల బృందం అవసరమవుతారని, దీనికి అలాంటి అవసరం ఉండదని చెప్పారు శాస్త్రవేత్త బ్రెయిన్ కన్నింగ్​హమ్. పీసీఆర్​ టెస్టుతో పోల్చినప్పుడు రెండు ఒకే విధమైన ఫలితాన్ని చూపించినట్లు వెల్లడించారు. పీసీఆర్ కంటే తమ పరికరమే బాగా పని చేస్తుందని వివరించారు. ముఖ్యంగా నమూనాను వేడి చేస్తుందని తద్వారా వైరస్​ విచ్ఛిన్నమై కరోనా జన్యు క్రమాన్ని గుర్తించగలుగుతున్నట్లు తెలిపారు.

పరికరం పనితీరు ఇలా..

శాస్త్రవేత్తలు తయారు చేసిన నమూనాలో 3డీ ప్రింటెండ్ క్యాట్రిడ్జ్​ పరికరం ఉంటుంది. హీటింగ్ ఛాంబర్ ఉండే చిన్న పరికరంలో ఈ క్యాట్రిడ్జ్​ను అమర్చుతారు. దీనిలో రెండు ఇంజెక్షన్స్​ ఉండేలా స్లాట్స్​ ఉంటాయి. ఒక దానిలో వైరస్​ నమూనాను, మరొక దానిలో రసాయనాన్ని ఉంచుతారు. రెండింటిని ఒక్కసారి ఇంజెక్షన్​ చేసిన తర్వాత.. హీటింగ్ ఛాంబర్ ద్వారా క్యాట్రిడ్జ్​ను 65 డిగ్రీల సెంట్రిగ్రేడ్ వద్ద వేడి చేస్తారు. తర్వాత అందులోని నమూనా చర్య జరిపి 30 నిమిషాల్లో ఫలితాన్ని వెల్లడిస్తుంది. పాజిటివ్ అయితే ఫ్లోరోసెంట్ లైట్ వెలుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.