Russia Ukraine Conflict: మరో రెండు రోజుల్లో రష్యా.. ఉక్రెయిన్పై దాడి చేస్తుంది అనడానికి అమెరికాకు చాలా సంకేతాలు అందాయన్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. దాడి చేసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని.. సరిహద్దు నుంచి రష్యా సైన్యాన్ని వెనక్కి తరలించకపోవడమే అందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఇతర దేశాలను తప్పుదోవ పట్టించేలా రష్యా చర్యలు చేపడుతున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ వివాదంపై స్పందిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ తాను ఇంకా చదవలేదన్నారు బైడెన్.
మరోవైపు రష్యా.. తమ దేశంలోని అమెరికా సీనియర్ దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చర్యకు గల కారణాన్ని రష్యా వెల్లడించలేదు. రష్యా వైఖరిని అమెరికా తప్పుపట్టింది. ఆ దేశం అర్థరహిత చర్యలు చేపడుతోందని పేర్కొంది.
ఇదీ చూడండి : Russia Ukraine conflict: ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పులు..!