ETV Bharat / international

ఉగ్రవాదానికి పాక్​ సాయంపై క్వాడ్​ నేతల ఆగ్రహం! - క్వాడ్​ సమావేశంలో మోదీ

పాకిస్థాన్​పై పరోక్ష విమర్శలు చేశారు క్వాడ్​ దేశాల(quad countries) నేతలు. దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. అఫ్గాన్(Afghanistan crisis)​ విషయంలో క్వాడ్​ దేశాలు సమన్వయంతో ముందుకు సాగుతాయని తెలిపారు.

Quad leaders
ఉగ్రవాదానికి పాక్​ సాయంపై క్వాడ్​ నేతల ఆగ్రహం
author img

By

Published : Sep 25, 2021, 10:02 AM IST

అమెరికా నేతృత్వంలో తొలిసారి నేరుగా సమావేశమైన క్వాడ్​ దేశాల(quad countries) అధినేతలు.. దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే దేశాల తీరును ఖండించారు. ప్రధానంగా పాకిస్థాన్​పై పరోక్ష విమర్శలు చేశారు. ఉగ్ర ముఠాలకు(Terrorism in Asia) ఎలాంటి సాయాన్నైనా అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

శుక్రవారం శ్వేతసౌధంలో జరిగిన క్వాడ్​ సదస్సు(quad summit 2021) అనంతరం ఉమ్మడి ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్​ ప్రధాని యొషిహిదే సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​. అఫ్గానిస్థాన్​(Afghanistan crisis)​ పట్ల దౌత్య, ఆర్థిక, మానవ హక్కుల విధానాల్లో సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు. అలాగే.. దక్షిణాసియాలో ఉగ్రవాద నిర్మూలన, మానవతా సహకారాన్ని మరింత పెంచనున్నట్లు చెప్పారు.

"ఉగ్రవాదాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించే విధానాలను ఖండిస్తున్నాం. ఆర్థికంగా, సైనిక, ఇతర ఏ విధంగానూ ఉగ్రవాద ముఠాలకు సాయం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. దాని ద్వారా సరిహద్దుల్లో దాడుల వంటి ఉగ్రదాడులకు దారి తీస్తుంది. అఫ్గానిస్థాన్​ భూభాగం ఉగ్ర ముఠాలకు అడ్డాగా మారకూడదు. అఫ్గాన్​లో ఉగ్రవాదం నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అఫ్గాన్​ పౌరులకు మద్దతుగా నిలుస్తాం. దేశాన్ని వీడాలనే పౌరులకు సురక్షిత సౌకర్యాలను కల్పించాలని తాలిబన్లను కోరుతున్నాం. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులను గౌరవించాలి."

- క్వాడ్​ ఉమ్మడి ప్రకటన

అఫ్గానిస్థాన్​(Afghanistan Taliban) సహా పాక్​ పోరుగు దేశాలతో పాటు అమెరికా.. చాలా ఏళ్లుగా ఇస్లామాబాద్​ ఉగ్రవాదానికి సురక్షిత ప్రాంతమని, ఆ దేశం వారికి సాయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే.. ఆ ఆరోపణలను పాక్​ ఖండిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి: ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసే శక్తిగా క్వాడ్​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.