ETV Bharat / international

చైనాపై అమెరికా ఫైర్​.. భారత అమర జవాన్లకు  సంతాపం

చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులకు అమెరికా సంతాపం తెలిపింది. సైనికుల మృతిపై భారత ప్రజలకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అయితే ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో భారత్​లో చైనా దురాక్రమణ వ్యూహాలు పన్నుతోందని అమెరికా కీలక సెనేటర్ ఆరోపించారు.

Pompeo
అమెరికా
author img

By

Published : Jun 19, 2020, 9:44 AM IST

Updated : Jun 19, 2020, 10:18 AM IST

గాల్వన్​ లోయ ఘర్షణలో భారత సైనికులు మరణించడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. సైనికుల మృతిపై భారత ప్రజలకు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

"చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికులకు మా సంతాపం తెలియజేస్తున్నాం. సైనికుల కుటుంబాలు, సన్నిహితులు, సమాజానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం."

- మైక్​ పాంపియో

హవాయిలో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి యాంగ్​తో భేటీ అయిన పాంపియో.. ఘర్షణ అంశం చర్చకు వచ్చిందా లేదా అన్న విషయాన్ని వెల్లడించలేదు. అయితే భారత్​- చైనా మధ్య ఉద్రిక్తతలను అమెరికా అధ్యక్షుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు శ్వేతసౌధం ఇప్పటికే ప్రకటించింది.

ఆక్రమణల కోసమే..

భూభాగాలను ఆక్రమించే ఉద్దేశంతోనే రెండు ఆసియా దిగ్గజాల మధ్య చైనా పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ ఘర్షణలను ప్రేరేపించిందని అమెరికా కీలక సెనేటర్​ మిచ్​ మెక్​కానెల్​ స్పష్టం చేశారు. కీలకమైన విదేశీ విధాన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు కానెల్​.

"అమెరికాతో పాటు దాని మిత్ర పక్షాల ప్రయోజనాలకు ప్రమాదం కలిగించే దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉంది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ ప్రపంచమంతా చూసింది. 1962 యుద్ధం తర్వాత అత్యంత హింసాత్మక ఘర్షణలను పీఎల్​ఏ ప్రోత్సహించింది. రెండు దేశాల మధ్య మేం శాంతిని కోరుకుంటున్నాం."

- మెక్​ కానెల్​, సెనేటర్​

కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే చైనా మాత్రం దురాక్రమణలకు అవకాశంగా వాడుకుంటోందని విమర్శించారు. తమ కోణంలో ప్రపంచ పటాన్ని మార్చేసే అంతలా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

"హాంకాంగ్​లో జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి ఆ భూభాగం మొత్తాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. సముద్రంలో జపాన్​ సమీపంలోని సెన్​కాకు దీవులకు సంబంధించి జపాన్​ను బెదిరిస్తోంది. తైవాన్​ గగనతలంలోకి నాలుగు సార్లు చొరబడి ఆ దేశమంతా తమదేనని వాదిస్తోంది."

- మెక్​కానెల్​, సెనేటర్​

అమెరికాకు చెందిన మరో ఉన్నతాధికారి డేవిడ్ స్టిల్​వెల్​ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అందరూ ఆపదలో ఉంటే.. చైనా మాత్రం పొరుగు దేశాలన్నింటితో కయ్యాలు పెట్టుకుంటోందని తెలిపారు. ఈ విపత్తును అవకాశంగా వాడుకుంటోందని ఆరోపించారు.

Last Updated : Jun 19, 2020, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.