కొవిడ్‌కు గురైనవారిలో సహజంగా ఉత్పత్తయ్యే యాంటీబాడీల(Covid Antibodies) కంటే.. ఫైజర్(Pfizer vaccine antibody levels), ఆస్ట్రాజెనికా(Astrazeneca vaccine antibody levels) టీకాలు తీసుకున్నవారిలోనే ఇవి అధికంగా ఉంటున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది! డెల్టా వేరియంట్‌నూ ఇవి సమర్థంగా(Astrazeneca vaccine efficacy) అడ్డుకుంటున్నట్టు తేలింది. కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ బృందం ఈ పరిశోధన సాగించింది. వుహాన్ వైరస్ సోకి, ఇంటి వద్దే కోలుకున్న 32 మందిలో యాంటీబాడీల తీరును పరిశోధకులు గమనించారు. యువకుల్లో కంటే 50 ఏళ్ల వయసు వారిలోనే కరోనా ప్రతినిరోధకాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని, కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత 16 వారాలపాటు ఇవి రక్తంలో ఉంటున్నాయని గుర్తించారు.
"వుహాన్ వేరియంట్ కారణంగా సహజంగా ఉత్పత్తయిన యాంటీబాడీలు... ఆ తర్వాత వచ్చిన వేరియంట్లపై 30-50 శాతం మేర మాత్రమే పోరాడుతున్నాయి. కొవిడ్ నుంచి కోలుకుని, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలు దాదాపు రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయి. అయితే, టీకాల కారణంగా ఉత్పత్తయ్యే ప్రతినిరోధకాలే అధిక సంఖ్యలో ఉంటున్నాయి. బీటా, గామా, డెల్టా వేరియంట్లనూ ఇవి సమర్థంగా అడ్డుకోగలవు" అని పరిశోధనకర్త జోయల్ పెలిటియర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చైనాకు 'జీరో- కొవిడ్' కష్టాలు.. జర్మనీలో రికార్డుస్థాయిలో కేసులు