ETV Bharat / international

'ప్లాన్​ బీ' వ్యాక్సిన్​తో కరోనాకు చెక్​! - ప్రోటీన్ వ్యాక్సిన్​

కరోనా వైరస్​పై పోరులో.. ప్రత్యేక రకమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేసే వ్యాక్సిన్​ సమర్థంగా పనిచేస్తోందని తాజా పరిశోధనలో తేలింది. ఇందుకోసం ఎలుకలపై ప్రయోగాలు చేశారు పరిశోధకులు.

Novel vaccine candidate shows promise against COVID-19, study finds
ప్రోటీన్లు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్​తో కరోనాకు చెక్​!
author img

By

Published : Sep 3, 2020, 5:40 PM IST

ప్రత్యేక రకమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేసే వ్యాక్సిన్​.. కరోనా వైరస్​పై సమర్థంగా పనిచేస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. కణాల్లోకి చేరేందుకు వైరస్​ వినియోగించే రెండు ప్రోటీన్లకు.. సహజసిద్ధమైన ప్రక్రియతో మార్పులు చేసి వాటి స్థాయిలను పెంచారు. అనంతరం వాటిని నానోపార్టికల్స్​లోకి ప్యాక్​ చేసి.. ఎలుకలకు ఇచ్చారు.

నెల రోజుల తర్వాత.. ఆ ఎలుకల్లో యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయి. మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్న టీకాలకు ఈ వ్యాక్సిన్​ ప్రత్యామ్నాయమని ఒహాయో విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్​ ప్రొఫెసర్ యిజౌ డాంగ్​​ చెప్పారు.

"ప్రస్తుతమున్న వ్యాక్సిన్​లు పనిచేస్తే మంచిదే. ఒక వేళ అవి విఫలమైతే.. ఇది ప్రత్యామ్నాయం(ప్లాన్​ బీ)గా ఉంటుంది. ఓ వ్యాక్సిన్​ ఎలా పనిచేయాలని కోరుకుంటామో.. ఇది అలాగే చేసింది."

--- యిజౌ డాంగ్​, ఒహాయో విశ్వవిద్యాలయ అసిస్టెంట్​ ప్రొఫెసర్​.

ఆర్​ఎన్​ఏలోని కొన్ని ప్రత్యేకమైన సీక్వెన్స్​ల​ను మార్చడం, జన్యు సమాచారాన్ని ప్రోటీన్లుగా మార్చగలిగే అణువులను మార్చడం ఇందులో భాగమని పరిశోధకులు వెల్లడించారు. ఈ సీక్వెన్సులు యూటీఆర్​(అన్​ట్రాన్స్​లేటెడ్​ రీజియన్స్​) అని పేర్కొన్నారు. వీటిని ప్రోటీన్లుగా మార్చనప్పటికీ.. అధికంగా ప్రోటీన్లు పొందగలిగేలా వీటి నిర్మాణంలో మార్పులు చేసినట్టు వివరించారు.

ఇదీ చూడండి:- మూడో దశకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.