ETV Bharat / international

కరోనా తీవ్రతకు, బ్లడ్​ గ్రూప్స్​నకు సంబంధం ఉందా?

కరోనా తీవ్రతకు బ్లడ్​ గ్రూప్​నకు సంబంధం లేదని మసాచుసెట్స్​ జనరల్ హాస్పిటల్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. నిర్దిష్ట రక్తం ఉన్నవారికి కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని ఇదివరకు వెల్లడైన పరిశోధనలకు సరైన ఆధారాలేవీ లేవని పేర్కొంది.

No relationship between blood type and severity of COVID-19, study finds
'బ్లడ్​ గ్రూప్​తో సంబంధం లేదు- అందరిపై అదే ఎఫెక్ట్'
author img

By

Published : Jul 18, 2020, 4:43 PM IST

Updated : Jul 18, 2020, 4:48 PM IST

బ్లడ్​ గ్రూప్​ను బట్టి కరోనా తీవ్రతేమీ మారదని మసాచుసెట్స్​ పరిశోధనలో తేలింది. బ్రడ్​ గ్రూప్​నకు కొవిడ్ తీవ్రతకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కొన్ని రక్త గ్రూపులకు కరోనాకు సంబంధం ఉందని ఇదివరకు వెలువడిన పరిశోధనలకు సరైన ఆధారం లభించలేదని వెల్లడించింది.

"నిర్దిష్టంగా ఏబీఓ బ్లడ్​ గ్రూప్​ ఉండటం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవు."

-పరిశోధన

'ఏ' గ్రూప్ రక్తం ఉన్నవారిలో వైరస్ తీవ్రత, మరణ ముప్పు అధికంగా ఉంటుందని ఇదివరకు కొంతమంది పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు దీనిపై అధ్యయనం చేసిన మసాచుసెట్స్​ జనరల్ హాస్పిటల్... ఓ భారీ డేటాబేస్​ను తయారు చేసింది. లక్షణాలు ఉండి కరోనా పాజిటివ్​గా తేలిన 1,289 మంది యుక్తవయసు రోగులను పరీక్షించింది. వారి బ్లడ్​ గ్రూప్​లు సేకరించింది. ఇందులో.. కరోనా రోగుల మరణానికి రక్త రకం ప్రభావం స్వతంత్రంగానే ఉందని తేలింది.

"సిస్టమిక్ ఇన్​ఫ్లెమేషన్ ద్వారా శరీరంలో కరోనా ప్రభావం అధికమై, తద్వారా మరణం సంభవిస్తుందని శాస్త్రీయంగా భావిస్తున్నారు. అయితే, రక్త గ్రూప్​తో సంబంధం లేకుండా కరోనా రోగులందరిలో ఇన్​ఫ్లెమేషన్ మార్కర్లు ఒకే విధంగా ఉన్నాయని మా పరిశోధనలో తేలింది."

-అనహిత దువా, ఎండీ

ఇదివరకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు.. రక్తంలో ఉండే ప్రొటీన్లకు, వ్యాధి తీవ్రతకు సంబంధం ఉందని వెల్లడించారు. ఐఎల్​-6 అనే ప్రొటీన్ ఇన్​ఫ్లెమేషన్ కలిగిస్తుందని తద్వారా కరోనా లక్షణాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి- ఆగని కరోనా విలయం.. 6 లక్షలకు చేరువలో మరణాలు!

Last Updated : Jul 18, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.