ETV Bharat / international

మృత్యుఘోష: ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి

author img

By

Published : Apr 5, 2020, 5:28 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహ్మమారి బారిన పడ్డ వారి సంఖ్య ఒక మిలియన్​ దాటింది. ఇప్పటివరకు 190 దేశాల్లో 60 వేల మందికిపైగా మరణించారు. అమెరికా న్యూయార్క్​లో ఒక్క రోజులో 630 మంది కరోనా ధాటికి బలయ్యారు. ఇప్పటివరకు న్యూయార్క్​ రాష్ట్రంలో 3,500 మంది వైరస్​ కారణంగా మరణించారు.

More than 60,000 deaths worldwide from coronavirus
మృత్యుఘోష: ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు మృతి

కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. కొద్ది రోజులుగా అక్కడ మృత్యువు విలయతాండవం చేస్తోంది. ఒక్క న్యూయార్క్​ రాష్ట్రంలో గత 24 గంటల్లో 630 మంది బలయ్యారు. అంటే ప్రతి రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోయినట్లు లెక్క. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,500కు చేరింది.

అమెరికా మెత్తం మీద 3 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా.. న్యూయార్క్​లో 1,13,704 మందికి ఈ మహమ్మారి సోకింది. న్యూ జెర్సీ 30వేలతో అత్యధిక కేసులు నమోదైన రెండో రాష్ట్రంగా నిలిచింది.

న్యూయార్క్​ రాష్ట్రంలో అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో లేకపోడవం వల్ల.. రోగులకు చికిత్స అందించడానికి వైద్యులకు కష్టంగా మారింది. వాటితో పాటు వ్యక్తిగత సంరక్షణ సామగ్రిలో భాగంగా మాస్కులు, గౌన్లు తదితర కిట్ల సదుపాయం తక్కువగా ఉందని రాష్ట్ర గవర్నర్​ పేర్కొన్నారు.

అమెరికాలోని న్యూయార్క్​ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ రకమైన పరికరాలను కూడా మనం తయారు చేసుకోలేం. వాటన్నింటినీ చైనా నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం

-ఆండ్రియో క్యూమో, న్యూయార్క్​ గవర్నర్​

ప్రస్తుతం 17వేల వెంటిలేటర్లను ఆర్డర్​ చేశామని.. అయితే పరిస్థితుల కారణంగా వీటి సరఫరా సరిపోదని పేర్కొన్నారు. మరోవైపు చైనా తమ వంతు సాయంగా 1,000 వెంటిలేటర్ల సదుపాయాన్ని కల్పించనున్నట్లు వివరించారు.

ఒక మిలియన్​ దాటిన కేసులు

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 11,30,204కు చేరింది. సుమారు 190 దేశాల్లో ముత్తం 60,457 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో అత్యధికంగా 15,362 మంది మృతి చెందగా.. స్పెయిన్​లో 11,744, అమెరికాలో 7,560, ఫ్రాన్స్​లో​ 6,507, బ్రిటన్​లో​ 4,313 మంది మహమ్మారికి బలయ్యారు.

కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశంలో లాక్​డౌన్​ను ఏప్రిల్​ 25వరకు పొడిగించినట్లు స్పెయిన్​ ప్రధాని పెడ్రో శాంచెజ్​ శనివారం ప్రకటించారు.

భవిష్యత్తులో మరింత తీవ్రం...

బ్రిటన్​లో తాజాగా 708 మంది మరణించగా.. ఇప్పటివరకు వైరస్ ధాటికి 4,313 మంది మృతి చెందారు. ఈ వారంలో రోజుకు 500 మంది చొప్పున వైరస్​కు బలయ్యారు. రానున్న 10 రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కానుందని అధికారులు తెలిపారు.

ఇక్కడా పరిస్థితి అంతే..

ఫ్రాన్స్​లోనూ వైరస్​ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో మరో 441 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో మొత్తం 7,560 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆయా దేశాల్లో పరిస్థితి ఇలా..

  • మాల్దీవుల్లో ఓ హోటల్​ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటిల్​ తేలడం వల్ల.. తొలి కేసు నమోదైంది.
  • చైనాలో మహమ్మారి బారిన పడి మరణించిన వారికి జాతీయ సంతాపం తెలిపారు.
  • కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 4.1 ట్రిలియన్​ డాలర్ల భారం పడింది. అమెరికాలో నిరుద్యోగ రేటు 4.4 శాతానికి పెరిగినట్లు నివేదకలు వెల్లడించాయి.
  • వైరస్​ కారణంగా వందల మిలియన్ల మందికి ఆహార కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆఫ్రికాలో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.