ETV Bharat / international

ల్యాబ్​ నుంచే వైరస్​! వుహాన్​లో ఏం జరిగింది? - కరోనా వైరస్​ అమెరికా

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్​.. వుహాన్​లోని ఓ ల్యాబ్​ నుంచే తప్పించుకుందన్న నివేదికలను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న వైరస్​ పరిణామాలపై అమెరికా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోందని.. కచ్చితంగా నిజాన్ని బయటపెడతామని ధీమా వ్యక్తం చేశారు.

Looking into reports that coronavirus 'escaped' from China's Wuhan lab: Trump
వుహాన్​ ల్యాబ్​ నుంచి తప్పించుకున్న కరోనా వైరస్​!
author img

By

Published : Apr 18, 2020, 11:47 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​.. చైనా వుహాన్​ ల్యాబ్​ నుంచి తప్పించుకుందా? లక్షకుపైగా మరణాలకు కారణమైన వైరస్​ పుట్టుకపై చైనా అబద్ధాలు చెబుతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు అమెరికా దర్యాప్తు చేపట్టింది. తాజాగా.. వుహాన్​లోని వైరాలజీ ల్యాబ్​ నుంచే ప్రపంచ మహమ్మారి తప్పించుకుందన్న నివేదికలను అగ్రరాజ్యం పరిశీలిస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు.

"ఈ విషయాన్ని మేము పరిశీలిస్తున్నాము. వీటన్నిటినీ కలిపి చూస్తుంటే ఏదో జరిగిందనే భావం ఏర్పడుతోంది. ఒక రకమైన గబ్బిలం గురించి చైనా మాట్లాడుతోంది. అయితే ఆ గబ్బిలం ఆ ప్రాంతంలోనే లేదు. అది 40 మైళ్ల దూరంలో ఉంది. వుహాన్​ మార్కెట్లలో ఆ రకమైన గబ్బిలాన్ని అసలు అమ్మనే లేదు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

వైరస్​ పుట్టుక చుట్టూ అనేక వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని.. నిజాన్ని కచ్చితంగా బయటపెడతామని అమెరికా అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వుహాన్​​ వైరాలజీ ల్యాబ్​కు.. మాజీ అధ్యక్షుడు ఒబామా తన హయాంలో 3.7 మిలియన్​ డాలర్ల నిధులు మంజూరు చేయడాన్ని గుర్తుచేశారు. త్వరలోనే ల్యాబ్​కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని స్పష్టంచేశారు.

ఈ పూర్తి వ్యవహారంపై వుహాన్​ ల్యాబ్​కు సంబంధించిన వివరాలను అమెరికా నిఘా అధికారులు సేకరిస్తున్నట్టు ఆ దేశ మీడియా కథనం ప్రచురిచింది. తమ వద్ద ఉన్న సమాచారంతో అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.

ఇదీ చూడండి:- ట్రంపరితనానికి కళ్లెం వేసిన కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.