ETV Bharat / international

'కరోనా అంతానికి భారత్​ పాత్రే కీలకం' - కరోనా అంతం

కరోనాను అంతమొందించడంలో కీలక పాత్ర భారత్​దేనని (India covid fight) అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ నిర్వాహకురాలు సమంత పవర్ (USAID Samantha power) పేర్కొన్నారు. టీకా కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా నిలుస్తోందని అన్నారు.

us india
అమెరికా ఇండియా
author img

By

Published : Oct 2, 2021, 10:22 AM IST

Updated : Oct 2, 2021, 11:46 AM IST

కరోనాను భూప్రపంచం నుంచి తరిమికొట్టేందుకు భారత్ (India covid fight) ముఖ్య పాత్ర పోషిస్తుందని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ (USAID Samantha power) అడ్మినిస్ట్రేటర్ సమంత పవర్ పేర్కొన్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ చాలా కాలంగా పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. టీకా కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా నిలుస్తోందని అన్నారు. (India US covid cooperation)

"ఈ భూమ్మీద కరోనా మహమ్మారిని (Covid 19 news) అంతం చేయడంలో భారతదేశం అత్యంత కీలక పాత్ర పోషించనుంది. టీకా తయారీ సామర్థ్యాలపై దీర్ఘకాలంగా భారత్ పెట్టిన పెట్టుబడులు, ఆ దేశ ఆవిష్కరణలు ఇందుకు దోహదం చేస్తాయి. ప్రస్తుతం మనం చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. టీకా కొరత తీవ్రంగా వేధిస్తోంది. భారత్ త్వరలోనే టీకాలను ఎగుమతి చేయనుంది."

-సమంత పవర్, అమెరికా ఎయిడ్ అడ్మినిస్ట్రేటర్

కరోనాతో పాటు వాతావరణ సమస్యల పరిష్కారంలో భారత్.. ప్రపంచదేశాలకు చుక్కాని అని అభివర్ణించారు సమంత. పునర్వినియోగ ఇంధన వనరులపై భారత్ దృష్టిసారిస్తోందని చెప్పారు. అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ వర్మతో జరిగిన సంభాషణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్​కు అమెరికా రాయబారిగా పనిచేశారు రిచర్డ్.

ఇదీ చదవండి: అమెరికాలో ఏడు లక్షలు దాటిన కరోనా మరణాలు

Last Updated : Oct 2, 2021, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.