అమెరికా, కెనడా దేశాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. అక్కడి భారత సంతతి ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.
అగ్రరాజ్యంలో..
వాషింగ్టన్లో డ్రైవ్ త్రూ ఫెస్టివల్ నిర్వహించారు ఇండో-అమెరికన్లు. ఒకేసారి 800 కార్లు.. జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మనీష్ సూద్, దీపా షహానీ దంపతులు ఈ డ్రైవ్ త్రూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎవరి కార్లో వారే, కార్యక్రమంలో పాల్గొనేలా చూసుకున్నారు. వాషింగ్టన్లో ఇంత ఘనంగా భారత స్వాతంత్ర్య సంబరాలు చేసుకోవడం ఇదే తొలిసారి.
ఇక న్యూయార్క్ నగరంలోనూ స్రాంతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. దాదాపు 200మంది భారత సంతతి కలిసి త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. కమ్యూనిటీ వ్యవహారాల మంత్రి అనురాగ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై.. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆ సమయంలో ఓ హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిసింది. ఆపై భారతీయ దేశభక్తి నినాదాలు చేశారు. దేశభక్తి పాటలకు ఆనందంతో చిందులేశారు.
-
#WATCH Canada: A 'Tiranga Car Rally' from Surrey to Vancouver organised by 'Gurukul Canada' and 'Friends of India-Canada' to celebrate #IndiaIndependenceDay.
— ANI (@ANI) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video source: Consulate General of India in Vancouver) pic.twitter.com/Axwril0bSZ
">#WATCH Canada: A 'Tiranga Car Rally' from Surrey to Vancouver organised by 'Gurukul Canada' and 'Friends of India-Canada' to celebrate #IndiaIndependenceDay.
— ANI (@ANI) August 16, 2020
(Video source: Consulate General of India in Vancouver) pic.twitter.com/Axwril0bSZ#WATCH Canada: A 'Tiranga Car Rally' from Surrey to Vancouver organised by 'Gurukul Canada' and 'Friends of India-Canada' to celebrate #IndiaIndependenceDay.
— ANI (@ANI) August 16, 2020
(Video source: Consulate General of India in Vancouver) pic.twitter.com/Axwril0bSZ
కెనడాలో మన జెండా..
కెనడాలో 'తిరంగా కార్ ర్యాలీ' నిర్వహించారు భారత సంతతి ప్రజలు. గురుకుల్ కెనడా, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అనే భారత సంఘాలు ఈ కార్యక్రమం చేపట్టాయి. సర్రే నుంచి వాంకోవ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వరకు కార్లు బారులు తీరాయి. ఈ ర్యాలీలోనూ దాదాపు అందరి చేతుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
ఇదీ చదవండి: నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా ఉప్పొంగగా!