అమెరికాలో తుపాకీ విషపు సంస్కృతి మరో నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ప్యూర్టోరికో ద్వీపంలోని పోన్స్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని బాస్కెట్ బాల్ కోర్టు సమీపంలో కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు పోలీసులు. కాల్పులకు తెగబడిన వారి ఉద్దేశాన్ని కూడా గుర్తించలేదు.
394 మంది..
32 లక్షల మంది జనాభా ఉన్న ప్యూర్టోరికో ద్వీపంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి ఘటనల్లో 394 మంది మరణించారు. 2019లో 481 మంది చనిపోయారు.
ఇదీ చూడండి: ఆ నగరంలో తుపాకీ సంస్కృతికి 10 మంది బలి