కొవిడ్-19కు చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సోమవారం తెలిపింది. కరోనా వైరస్‌పై చికిత్సలో ఈ మందులు సమర్థంగా వ్యవహరించే అవకాశం లేదని పేర్కొంది. వీటివల్ల కలిగే ప్రయోజనాల కన్నా ముప్పే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
దశాబ్దాల నాటి ఈ ఔషధాలను ప్రధానంగా మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్నారు. ఎఫ్‌డీఏ తాజా నిర్ణయం వల్ల.. ఫెడరల్ ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ ఔషధాలను రాష్ట్ర, స్థానిక అధికారులకు పంపిణీ చేయడం కుదరదు.
మార్చి 28న క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అత్యవసర వినియోగ ఔషధంలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఎఫ్‌డీఏ.
ఇదీ చూడండి: ట్రంప్ ప్రచార సభ వాయిదా.. ఆఫ్రో అమెరికన్ల డిమాండ్లే కారణం