ETV Bharat / international

ఈటా తుపాను బీభత్సం-15 మంది మృతి - hurricane eta 2020 news

మధ్య అమెరికా, మెక్సికోలో బీభత్సం సృష్టించిన ఈటా తుపాను.. క్యూబా, దక్షిణ ఫ్లోరిడాపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ తుపాను ధాటికి పదుల సంఖ్యలో మరణించగా.. 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలో అత్యయిక స్థితిని ప్రకటించారు.

CUBA-ETA
ఈటా తుపాను
author img

By

Published : Nov 9, 2020, 9:14 AM IST

బలమైన గాలులతో ఈటా తుపాను క్యూబా, దక్షిణ ఫ్లోరిడాపై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంది. అంతకుముందు మధ్య అమెరికా, మెక్సికోలో ఈ హరికేన్​ ధాటికి పదుల సంఖ్యలో మరణించారు. 100 మందికిపైగా గల్లంతయ్యారు. తుపాను కారణంగా గ్వాటెమాలాలో కురిసిన భారీ వర్షానికి కొండచరియల విరిగిపడటం వల్ల చాలా మంది మట్టిగడ్డల కింద కూరుకుపోయారు.

ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందగా.. 109 మంది గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది విరిగిన కొండచరియల కిందే చిక్కుకుపోయినట్లు తెలిపారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దాదాపు 150 ఇళ్లు ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు.

ఈ రాష్ట్రాలకు ముప్పు..

దక్షిణ ఫ్లోరిడా, ఫ్లోరిడా కీస్​లకు 'అమెరికా జాతీయ తుపాను హెచ్చరికల కేంద్రం' ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సెంట్రల్ క్యూబా, దక్షిణ ఫ్లోరిడా, కీస్​లలోని కొన్ని ప్రాంతాల్లో తుపాను ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.

ఈటా.. ఆదివారం ఉదయానికి క్యూబాలోని క్వామగ్వేకు పశ్చిమంగా 145 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతానికి ఈశాన్య దిశగా గంటకు 100 కిలోమీటర్లు వేగంతో వీస్తున్న గాలులతో.. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో ఈటా కదులుతోందని వెల్లడించింది.

ఫ్లోరిడాలో రెడ్​ అలర్ట్​..

ఫ్లోరిడా కీస్, దక్షిణ ఫ్లోరిడాను ఆదివారం సాయంత్రం లేదా సోమవారం నాటికి తుపాను తాకనుంది. ఈ నేపథ్యంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్​ డిశాంటిస్.. శనివారం ఎనిమిది కౌంటీల్లో అత్యయిక స్థితిని ప్రకటించారు. నిత్యవసర వస్తువులను నిల్వ ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు.

కరోనా పరీక్ష కేంద్రాలు, నౌకాశ్రయాలు, బీచ్​లు మూసేశారు. ఓడరేవుల సమీపంలోని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కీస్ ప్రాంతంలో తుపాను కదలికలను ప్రభుత్వ యంత్రాంగం నిశితంగా పరిశీలిస్తోంది.

ఇదీ చూడండి: జూన్​ నుంచి చైనాలోనే భారత నౌక.. సిబ్బంది ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.