ETV Bharat / international

ట్రంప్​ 'వీసా' దెబ్బతో నష్టం ఎవరికి? లాభపడేదెవరు?

author img

By

Published : Jun 23, 2020, 2:06 PM IST

Updated : Jun 23, 2020, 2:54 PM IST

హెచ్​-1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మంగళవారం ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు ఈ హెచ్​-1బీ వీసా అంటే ఏంటీ? ఇది ఎందుకు ఉపయోగిస్తారు? అధ్యక్షుడి నిర్ణయంతో ఎవరికి లాభం? భారతీయులకు నష్టం తప్పదా? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ కథనం.

Corporates, lawmakers, rights bodies slam Trump admin's move to suspend H-1B, other work visas
హెచ్​-1బీ వీసా రద్దుతో ఎవరికి లాభం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. తాజాగా హెచ్​-1బీ, ఎల్​-1 వీసాలు నిలిపివేస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటన కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వీసా వ్యవహారంపై నెలకొన్న ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు...

హెచ్​-1బీ, ఎల్​-1 వీసా అంటే ఏంటి?

అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో తాత్కాలికంగా పని చేయడానికి వీలు కల్పించేవే ఈ హెచ్​-1బీ, ఎల్​-1 వీసాలు.

ట్రంప్​ తీసుకున్న నిర్ణయమేంటి?

అమెరికాలో పనిచేయాలనుకునే విదేశీయులకు సంబంధించిన ఇంత ముఖ్యమైన వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తున్నట్టు ట్రంప్​ ప్రకటించారు.

ఎందుకీ నిర్ణయం?

కరోనా సంక్షోభం వల్ల అనేక మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. వారికి అండగా నిలవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు ట్రంప్.

దీని వల్ల అమెరికాకు లాభముంటుందా?

హెచ్​-1బీ, ఎల్​-1 వీసాల రద్దుతో అమెరికావ్యాప్తంగా 5,25,000 వరకు ఉద్యోగాలు ఖాళీ అవుతాయని, అవన్నీ స్థానికులకే వస్తాయని సీనియర్​ అధికారులు అంచనా వేస్తున్నారు.

విధానాల్లోనూ మార్పులుంటాయా?

నిజానికి ఈ హెచ్​-1బీ వీసా కోసం ఇప్పటివరకు లాటరీ విధానం అమల్లో ఉంది. తాజాగా దాన్ని రద్దు చేసి నైపుణ్యం ఆధారంగా వీసాలు అందివ్వాలని అధికారులకు ఆదేశించారు ట్రంప్​.

భారతీయులపై ప్రభావం ఉంటుందా?

అమెరికా ఏటా జారీ చేసే 85వేల వీసాల్లో 70శాతం భారతీయ ఐటీ నిపుణులకే దక్కుతాయి. ఈ నేపథ్యంలో హెచ్​-1బీని నిలిపివేస్తూ ట్రంప్​ తీసుకున్న నిర్ణయంతో భారతీయులు తీవ్రంగా నష్టపోనున్నారు. అక్టోబర్​ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే జారీ చేసిన వీసాలపైనా ఈ ప్రభావం పడనుంది. అదే విధంగా వీసాను పునరుద్ధరించుకోవడానికి ఈ ఏడాది చివరి వరకు వేచి చూడక తప్పదు.

ట్రంప్​ నిర్ణయంపై ఎవరేమన్నారు?

ట్రంప్​ ప్రకటనపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్​ ప్రపంచం తీవ్రంగా మండిపడింది. అధ్యక్షుడి నిర్ణయంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని, పెట్టుబడులు తరలిపోతాయని, ఉద్యోగ కల్పన ఉండదని అభిప్రాయపడింది.

"దేశంలోకి వచ్చే వలసదారులను నియంత్రించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్​లు, వైద్యులు, నర్సులను దేశంలోకి అహ్వానించకపోతే.. అమెరికానే నష్టపోతుంది."

--- థామస్​ డొనొహ్యు, యూఎస్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ సీఈఓ

"అమెరికా ఆర్థిక వ్యవస్థ విజయంలో ఇమిగ్రేషన్​ కీలక పాత్ర పోషించింది. ఇమిగ్రేషన్​ వల్లే సాంకేతిక రంగంలో అమెరికా ప్రపంచస్థాయికి ఎదిగింది. గూగుల్​ కంపెనీ కూడా ఈ స్థాయిలో ఉండటానికి కారణం అదే. ట్రంప్​ నిర్ణయంతో నిరాశ చెందా. వలసదారులకు అండగా ఉంటాం. అందరికీ అవకాశం లభించేలా చూస్తాం."

-- సుందర్​ పిచాయ్​, గూగుల్​ సీఈఓ

"హెచ్​-1బీ వీసా సదుపాయంతో ఇన్నేళ్లు ఉత్తమమైన వారికి అవకాశం లభించింది. దీని వల్ల అమెరికా విజయవంతమైంది, మరింత దృఢంగా మారింది. విదేశీయుల ప్రతిభను గుర్తించడం అమెరికాకు ఉన్న శక్తి. అంతే కానీ అది బలహీనత కాదు!"

--- ఏ.జీ వెల్స్​, అమెరికా విదేశాంగ శాఖ మాజీ ఉన్నతాధికారి.

"తాజా నిర్ణయంతో ట్రంప్​ మరోసారి జాతి వివక్ష వైఖరిని ప్రదర్శించారు. అయితే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధ్యక్షుడు చేపట్టే చర్యలు పనిచేయవు. వలసదారులకు ఆయన చేసిన అన్యాయాన్ని కోర్టులు అడ్డుకుంటాయి."

--- వనితా గుప్తా, ఎల్​సీసీహెచ్​ సీఈఓ.

"మనం ఇంకా ప్రపంచవ్యాప్త ఆరోగ్య, ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాం. ఉన్న వనరులను ఉపయోగించుకుని అమెరికాను బలపరిచే సమయం ఇది. కానీ ఈ నిషేధం వల్ల ఉద్యోగాలు, కుటుంబాలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల, సంఘాలు దెబ్బతింటాయి. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరింత ఆలస్యమవుతుంది."

--- జెన్నిఫర్​ మినార్​​, అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ లాయర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​.

"ఇమ్మిగ్రేషన్​ సంప్రదాయనికి ఇది ఓ మచ్చ. అందరం ఐకమత్యంతో ఉండి అధ్యక్షుడి చర్యను వ్యతిరేకించాలి. వలసదారులపై ఆయన చూపిస్తున్న వివక్షను అడ్డుకోవాలి."

-- బెర్త్​ వెర్లిన్​, అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ కౌన్సిల్​ ఎగ్జిక్యూటివ్​.

అధ్యక్ష ఎన్నికలపై హెచ్​1బీ వీసాల వ్యవహారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ప్రశ్నార్థకం.

Last Updated : Jun 23, 2020, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.