ETV Bharat / international

అగ్రరాజ్యంలో తగ్గుతున్న శ్వేతజాతీయులు!

అమెరికా జనాభా లెక్కలను ఆ దేశ సెన్సస్​ బ్యూరో విడుదల చేసింది. దేశంలో శ్వేతజాతీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు వెల్లడించింది. 2010లో 63.7 శాతం ఉన్న శ్వేతజాతీయుల జనాభా 2020 నాటికి 57.8 శాతానికి పడిపోయిందని తెలిపింది.

white population in us
అగ్రరాజ్యంలో తెల్లవారి కంటే మనోళ్లదే హవా!
author img

By

Published : Aug 13, 2021, 6:40 PM IST

అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్ల జనాభా పెరిగినట్లు అమెరికా సెన్సెస్​ బ్యూరో వెల్లడించింది. గడిచిన దశాబ్దంలో ఆసియాకు చెందిన వారి జనాభా మూడు వంతులు పెరిగినట్లు పేర్కొంది. 2020 నాటికి వీరి జనాభా 2.4 కోట్లకు చేరినట్లు తెలిపింది. మరోవైపు శ్వేతజాతీయుల జనాభా గణనీయంగా తగ్గుతోందని వెల్లడించింది. 2010లో 63.7 శాతం ఉన్న శ్వేతజాతీయుల జనాభా 2020 నాటికి 57.8 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఈ కొత్త గణాంకాలు 2022లో రానున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నివేదికలోని వివరాలు..

  • ఐరోపా, పశ్చిమాసియా​ మూలాలు ఉన్న తెల్లజాతి అమెరికన్ల జనాభా 2010లో 19.6 కోట్లు ఉండగా.. 2020 నాటికి 19.1 కోట్లకు తగ్గింది. కాలిఫోర్నియాలో హిస్పానిక్స్​ (స్పానిష్​, లాటిన్​ అమెరికా మూలాలు ఉన్న వారు) జనాభా 37.6 శాతం నుంచి 39.4 శాతానికి వృద్ధి చెందింది. అయితే ఈ ప్రాంతంలో శ్వేతజాతీయుల జనాభా మాత్రం 40.1 శాతం నుంచి 34.7 శాతానికి పడిపోయింది. 2020 నాటికి దేశవ్యాప్తంగా హిస్పానిక్స్​ సంఖ్య 6.2 కోట్లగా నమోదైంది.
  • బహుళజాతులకు చెందిన వారి సంఖ్య పెరుగుదలే ఈ గణాంకాలపై ప్రభావం చూపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. 2010లో వీరి జనాభా 90 లక్షలు ఉండగా.. 2020కి ఆ సంఖ్య 3.3 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఉన్న అమెరికా జనాభాలో 10 శాతం వీరే ఉన్నారు.
  • శ్వేతజాతీయులు, ఆసియా, అమెరికన్ ఇండియన్, హవాయియన్​, నల్లజాతి, పసిఫిక్​ దీవుల వారు మినహా ఇతర జాతుల వారి సంఖ్య దాదాపు 5 కోట్లకు చేరింది. ఇది 4.6 కోట్లగా ఉన్న నల్లజాతి వారి జనాభా కంటే ఎక్కువ.
  • అగ్రరాజ్యంలో గడిచిన పదేళ్లలో మెట్రో నగరాలకు వలసలు పెరిగాయి. దాదాపు 80 శాతం మెట్రో నగరాల్లో జనాభా పెరిగింది.
  • 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారి జనాభా స్వల్పంగా తగ్గింది. వీరి జనాభా 2010లో 7.4 కోట్లు ఉండగా 2020లో అది 73.1 కోట్లుగా నమోదైంది.

ఇదీ చదవండి : మెరుపు వేగంతో తాలిబన్ల దురాక్రమణ- అధ్యక్షుడు రాజీనామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.