ETV Bharat / international

'ప్రాంతీయ భద్రతకు భారత్​-అమెరికా సైన్యాల సహకారం' - సీడీఎస్ న్యూస్

సీడీఎస్​ జరనల్ బిపిన్​ రావత్​... అమెరికా జాయింట్ చీఫ్స్​ ఆఫ్ స్టాఫ్​ ఛైర్మన్​ జనరల్​ మార్క్​ మిల్లేతో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత సహా ఇతర కీలక విషయాలపై చర్చించారు. ఇరు దేశ సైన్యాల శిక్షణ, అభ్యాసాల్లో సహకారాన్ని కొనసాగించాలని అంగీకారానికి వచ్చారు.

CDS General Rawat
సీడీఎస్​ రావత్​
author img

By

Published : Oct 1, 2021, 9:52 AM IST

అమెరికా పర్యటనలో ఉన్న సీడీఎస్ బిపిన్ రావత్​.. యూఎస్​ ఛైర్మన్​ ఆఫ్ జాయింట్స్ చీఫ్స్​ జనరల్​ మార్క్ మిల్లేతో గురువారం భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత సహా కీలక విషయాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల శిక్షణ, అభ్యాసాల్లో సహకారం కొనసాగించాలని అంగీకారానికి వచ్చారు. సైన్యాల ఇంటరాపరబిలీటీ పెంచేందుకు మరిన్ని అవకాశాలను సృష్టించాలని నిర్ణయించారు. ఈ మేరకు మిల్లే కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సాయుధ దళాల గౌరవ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన సీడీఎస్ రావత్​కు మిల్లే ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఓ అమెరికా అమర సైనికుడి సమాధికి రావత్​ నివాళులు అర్పించారు. అనంతరం రావత్, మిల్లే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​లో సమావేశమయ్యారు.

భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యంలో భాగంగా రెండు దేశాలు బలమైన సైనిక సంబంధాలను కలిగి ఉన్నాయని మిల్లే పేర్కొన్నారు.

పర్యటనలో భాగంగా బుధవారం వాషింగ్టన్​లోని లుయిస్​-మెక్​కోర్డ్​ జాయింట్ బేస్​ను సందర్శించారు రావత్.

ఇదీ చూడండి: ఫ్రాన్స్​ మాజీ అధ్యక్షుడికి ఏడాది జైలు శిక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.