ETV Bharat / international

ఒక్కసారి సోకిన వారికి కరోనా మళ్లీ వస్తుందా?

ఒక్కసారి కరోనా బారిన పడ్డవారికి మళ్లీ వైరస్ సోకే ప్రమాదముందా? ఒకవేళ వచ్చినా.. వైరస్​పై మరోసారి పోరాడగల రోగ నిరోధక శక్తి వాళ్లకు ఉంటుందా? అంటే దాదాపు ఔననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోలుకున్న వారికి కరోనా మళ్లీ సోకే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు.

Can you get the coronavirus twice?
ఒక్కసారి సోకిన వారికి కరోనా మళ్లీ వస్తుందా?
author img

By

Published : Jul 28, 2020, 4:15 PM IST

కరోనా మహమ్మారి యావత్​ ప్రంపంచాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో కోరనాకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించారు అమెరికా ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి వైరస్​ బారిన పడిన వారికి మళ్లీ వ్యాధి సోకే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారికి కొన్ని వారాల తర్వాత మళ్లీ పాజిటివ్​గా తేలుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. రెండోసారి వ్యాధి బారినపడ్డట్లు బాధితులు భావిస్తున్నారు. అయితే పరీక్షల పొరపాట్ల వల్ల కూడా కరోనా నుంచి కోలుకున్న వారికి పాజిటివ్​ వచ్చి ఉండవచ్చని తెలిపారు బోస్టన్ కాలేజ్​లో గ్లోబల్ పబ్లిక్​ హెల్త్ ప్రోగ్రామ్​ డైరెక్టర్​ డా. ఫిలిప్​ లాండ్రిగన్​. రెండోసారి పాజిటివ్ వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదన్నారు.

కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, అవి వైరస్​పై పోరాడి నశింపజేస్తాయని ఇటీవల ప్రచురితమైన అమెరికా అధ్యయనం తెలిపింది. అయితే ఈ యాంటీబాడీలు శరీరంలో దీర్ఘకాలం ఉండలేవని పేర్కొంది. యాండీబాడీలు మాత్రమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థ కూడా వైరస్​పై పోరాడగలదని పరిశోధన స్పష్టం చేసింది. కరోనా బారినపడ్డవారిలో ఈ రెండు మరోసారి వైరస్ బారిన పడకుండా రక్షిస్తాయని వివరించింది.

కరోనా బాధితులు మళ్లీ వైరస్ బారిన పడే అవకాశాలుంటే అది ఇమ్యునిటీ పాస్​పోర్టులను బలహీన పరిచినట్లేనని లాండ్రిగన్​ చెప్పారు. అలాంటప్పుడు దీర్ఘకాలిక రక్షణ కోసం టీకాపైనే ఆశలు పెట్టుకోవాలన్నారు.

ఇదీ చూడండి: కరోనా: 6 వారాలు.. 6 నెలలు.. ఆరోసారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.