ETV Bharat / international

'గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే!'

author img

By

Published : Jul 30, 2020, 3:08 PM IST

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?... కొంతకాలంగా విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశమిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలు, నిపుణుల నివేదికలు చూస్తే ఔననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. మరి వైరస్​ సోకకుండా జాగ్రత్త పడడం ఎలా?

who
గాలిద్వారా కరోనా నిజమే: డబ్ల్యూహెచ్​ఓ

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందనే అభిప్రాయాలు కొంతకాలంగా నెలకొని ఉన్నాయి. అయితే వీటిని బలపరిచేలా ఇటీవల ప్రకటన విడుదల చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). ప్రత్యేక పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వ్యాపించవచ్చని పేర్కొంది. రెస్టారెంట్లు, నైట్​ క్లబ్​లు వంటి చోట్ల వైరస్ గాలిలో వ్యాపిస్తుందని.. భౌతిక దూరం నిబంధనలు పాటించనట్లయితే ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువని అభిప్రాయపడింది.

మూసి ఉండే గదుల్లో వెంటిలేషన్ సరిగా లేకపోవడం.. వైరస్ వ్యాప్తికి దోహదపడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ సమయం వైరస్​ కణాలు గాలిలో ఉండటానికి వీలు కల్పిస్తుందని చెబుతున్నారు. మాట్లాడటం ద్వారా బయటకొచ్చే లాలాజలం అన్ని మార్గాలు మూసి ఉండే గదుల్లో 8 నుంచి 14 నిమిషాల పాటు గాలిలో ఉంటుందని అంటున్నారు నిపుణులు.

వైద్య సిబ్బందికి సోకే ప్రమాదం ఎక్కువ

గాలిద్వారా వ్యాప్తి చెందే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్నవారిలో శ్వాస నాళం, వెంటిలేటర్ ఏర్పాటు చేసే వైద్యులు, నర్సులు ఉన్నట్లు పేర్కొంది డబ్ల్యూహెచ్​ఓ. ఈ విధులను నిర్వర్తించే సమయంలో సమర్థమైన మాస్కులు, ఇతర రక్షణ పరికరాలు ధరించాలని సూచించింది.

అయితే మూసి ఉండే గదుల్లో కంటే, బహిరంగ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటోందని తెలిపింది డబ్ల్యూహెచ్ఓ.

ఇదీ చూడండి: భారత్​-చైనాకు ఆ విషయం పట్టదు: ట్రంప్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.