అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. పొడి వాతావరణానికి బలమైన గాలులు తోడవడం వల్ల అంతకంతకూ విజృంభిస్తూ.. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద దావానలంగా మారింది. ఉత్తర కాలిఫోర్నియాలోని సుందరమైన అటవీ ప్రాంతాలను దహించివేస్తోంది.
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_homes-and-cars-destroyed-by-the-dixie-fire-line-central-greenville-on-thursday-aug-5-2021-in-plumas-county-calif.jpg)
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_an-ornament-rests-in-front-of-a-greenville-home-destroyed-by-the-dixie-fire-in-plumas-county-calif-on-friday-aug-6-2021.jpg)
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_deer-pass-a-greenville-building-destroyed-by-the-dixie-fire-on-saturday-aug-7-2021-in-plumas-county-calif.jpg)
ఉత్తర సియెర్రా నెవాడాలో 370 ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 14,000 భవనాలు కార్చిచ్చు వల్ల ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటివరకు 1,813 చదరపు కిలోమీటర్లు మేర దావానలం వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_firefighters-battling-the-dixie-fire-clear-highway-89-after-a-burned-tree-fell-across-the-roadway-in-plumas-county-calif.jpg)
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_greenville-resident-kesia-studebaker-who-lost-her-home-to-the-dixie-fire-secures-belongings-before-leaving-a-susanville-calif-evacuee-shelter-with-her-dog-logan-on-friday-aug-6-2021.jpg)
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_burned-trees-and-smoke-fill-the-bear-river-canyon-after-the-river-fire-burned-through-friday-aug-6-2021-in-chicago-park-calif.jpg)
కార్చిచ్చును అదుపు చేస్తుండగా.. ఓ చెట్టు కొమ్మ విరిగిపడి నలుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_california-gov-gavin-newsom-surveys-greenville-homes-leveled-by-the-dixie-fire-on-saturday-aug-7-2021-in-plumas-county-calif.jpg)
దావానలం ధాటికి ఆహుతైన ప్రాంతాలను రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ సందర్శించారు. పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
![California wildfire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12708833_smoke-from-california-wildfires-obscures-the-view-of-strip-casinos-in-las-vegas-saturday-aug-7-2021.jpg)