అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావానలం ధాటికి శాక్రమెంటో కౌంటీలోని రాంచో మెరీనా పార్క్‌లోని ఓ భవనం, 25 మొబైల్ హౌస్‌లు, 16 వాహనాలు (రిక్రియేషనల్ వాహనాలు-ఆర్వీ) బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దావాగ్నికి బలమైన గాలులు తోడవడం వల్ల కార్చిచ్చు మరింత విస్తరిస్తోందని అధికారులు తెలిపారు.
కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం.. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో 23 కౌంటీల్లో 24 వేల మందికిపైగా అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మంగళవారం కొన్ని ప్రాంతాల్లో తిరిగి విద్యుత్ సరఫరా ప్రారంభించారు.
ఇదీ చూడండి: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు- భారీగా ఆస్తినష్టం