ETV Bharat / international

జైలు నుంచి తప్పించుకునేందుకు కరోనా అంటించుకున్నారు!

author img

By

Published : May 12, 2020, 5:57 PM IST

లాస్‌ ఏంజెల్స్​లో ఓ జైల్లోని ఖైదీలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు కరోనా అంటించుకున్నారు. అవును, కరోనా సోకితే తమను విడుదల చేస్తారని భావించి.. కోరి కోరి వైరస్​ను తెచ్చుకున్నారు. ఒక్క మాస్కునే అందరూ పంచుకుని, వేడి నీళ్లు తాగి శరీర ఉష్ణోగ్రతలు పెంచుకుని మరీ 30 మంది ఖైదీలు వ్యాధి బారినపడ్డారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్​ అయ్యాయి.

'Los Angeles inmates tried to get virus'
జైలు నుంచి తప్పించుకునేందుకు కరోనా తెచ్చుకున్నారు!

లాస్‌ ఏంజెల్స్​లో జైలు శిక్ష తప్పించుకోవాలనే కోరికతో వింత ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు కొందరు ఖైదీలు. జైల్లో కరోనా సోకితే తమను ఇంటికి పంపిస్తారని భ్రమపడి, 30 మంది ఖైదీలు వైరస్​ బారిన పడ్డారు.

మాస్కులు, వేడి నీళ్లు...

ఎలాగైనా వైరస్​ తెచ్చుకుని జైలు నుంచి విడుదల కావాలనే పట్టుదలతో.. ఖైదీలు ఓ పన్నాగం పన్నారు. రెండు బృందాలుగా విడిపోయారు. నర్సు వైద్య పరీక్షలు నిర్వహించడానికి తమ వార్డుల్లోకి వచ్చేముందే ఓ డ్రమ్​ నిండా వేడి నీటిని సేవించారు ఓ బృందంలోని ఖైదీలు. వేడి నీరు శరీర ఉష్ణోగ్రను పెంచుతుందని భావించారు. దీంతో వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులను నమ్మించాలనుకున్నారు. మరో బృందంలోని ఖైదీలు.. ఒకే మాస్కును మార్చి మార్చి తాకి, వాసన పీల్చారు. దీంతో ఎవరో ఒకరి నుంచి వైరస్​ వ్యాపిస్తుందనుకున్నారు. అనుకున్నట్టుగానే, రెండు వారాల్లో 30 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వీరి చర్యలు జైల్లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దృశ్యాలను చూసిన అధికారులు నివ్వెరపోయారు.

అమెరికాలో ఇప్పటి వరకు 25 వేల మంది ఖైదీలు వైరస్​ బారిన పడ్డారు. 350 మంది మృతి చెందారని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్​ ఏంజెల్స్​ స్కూల్​ ఆఫ్​ లా అనధికారిక అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: లాక్​డౌన్​లో ఇలా చేస్తే తలనొప్పి దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.