ETV Bharat / international

40 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన- 10 మంది మృతి - అగ్రరాజ్యంలో భారీ వర్షాలు

అమెరికాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల కారణంగా టెన్నెస్సీ రాష్ట్రంలో 10 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది.

flash floods in america
అమెరికాలో వరద బీభత్సం
author img

By

Published : Aug 22, 2021, 2:02 PM IST

అమెరికాలో వరద బీభత్సం

అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ వరదల్లో చిక్కుకుని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వరదల ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నీట మునగగా, కొన్ని కూలిపోయాయి. 30 మందికి పైగా వరదల్లో గల్లంతయ్యారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగటం వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు తెలిపారు.

america floods
ఉప్పొంగుతున్న కాల్వలు
america floods
పూర్తిగా ధ్వంసమైన ఇళ్లు, కార్లు
america floods
దెబ్బతిన్న రహదారి

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 34.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. 1982 నుంచి ఈ స్థాయిలో వర్షం నమోదుకావటం ఇదే మొదటిసారన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో టెన్నెస్సీ గవర్నర్ ట్వీట్ చేశారు. అటు న్యూజెర్సీలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అటు న్యూజెర్సీలోనూ భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

america floods
భారీ వరదలతో కొట్టుకుపోతున్న వాహనాలు, ఇళ్లు
america floods
కుప్పకూలిన ఇళ్లు

ప్రయాణాలు రద్దు చేసుకోండి..

వరద ఉద్ధృతి పెరుగుతున్నందున టెన్నెస్సీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ బిల్​లీ కోరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర విభాగంతో కలిసి పనిచేస్తున్నామన్నారు.

america floods
వాహనాలు ధ్వంసం

అటు టెన్నెస్సీ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ కూడా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి: క్యాపిటల్ భవనం వద్ద బాంబు.. లొంగిపోయిన నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.