explosion in Ghana: ఆఫ్రికా దేశమైన ఘనాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే వైద్య, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. పలువురు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘనాకు పశ్చిమ దిశలోని బొగొసో పట్టణంలో ఈ పేలుడు సంభవించింది.
బంగారు గనికి పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న ట్రక్కును ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి ట్రక్కుకు అంటుకున్నాయి. మంటల వ్యాప్తితో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. అయితే ఎంత మంది చనిపోయారనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా చెప్పనప్పటికీ స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు సంభవించిన అనంతర దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయమని, దురదృష్టకరమైనదని ఆదేశ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: సిరియాలో రాకెట్ దాడి.. ఆరుగురు మృతి