ETV Bharat / international

నిరాశ్రయులపై ఉగ్ర పంజా- 60 మంది మృతి! - according to the head of a local NGO and a witness: Reuters

Congo Terror Attack: డీఆర్ కాంగోలో నిరాశ్రయుల శిబిరంపై సాయుధుల ముఠా దాడి చేసింది. ఈ ఘటనలో 60మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

Democratic Republic of Congo
నిరాశ్రయుల శిబిరంపై సాయుధుల దాడి- 60 మంది మృతి!
author img

By

Published : Feb 2, 2022, 4:20 PM IST

Updated : Feb 2, 2022, 10:43 PM IST

Congo Terror Attack: డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో మిలీషియా సభ్యులు భీకర దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అక్కడ వలసదారుల శిబిరంపై దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో దాదాపు 60 మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఇటూరీ ప్రావిన్సుల్లో సావో శిబిరంలో జరిగిన ఈ మారణహోమానికి మిలీషియా సభ్యులే బాధ్యులని అక్కడి స్థానిక మానవ హక్కుల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

గతకొన్నేళ్లుగా ఇటూరీ ప్రావిన్సులో తలదాచుకున్న వందలాది మంది వలసదారులను మిలీషియా దళాలు చంపినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటికే వేల మంది పౌరులు తమ నివాసాలను ఖాళీచేసి వెళ్లిపోయినట్లు తెలిపాయి. తాజాగా జరిగిన ఘటన కూడా శిబిరాల నుంచి వలసదారులను వెళ్లగొట్టే లక్ష్యంతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది.

అయితే, ప్రస్తుతం సావో వలసదారుల శిబిరంలో 4వేల మంది తలదాచుకుంటున్నట్లు ఐరాస వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఈ దాడులు మరింత ఎక్కువైనట్లు పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ప్రపంచంలోనే అతిపెద్ద మెరుపు.. 770 కిలోమీటర్ల మేర వ్యాప్తి

Last Updated : Feb 2, 2022, 10:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.