ETV Bharat / entertainment

Bigg Boss 7 Telugu First Week Elimination: బిగ్​బాస్​ ఫస్ట్​ వీక్​.. ఎలిమినేట్ అయ్యేది అతనా? ఆమెనా..?? - kiran Rathod eliminate from bigg boss

Bigg Boss 7 Telugu First Week Elimination: ఉత్సాహంగా మొదలైన బిగ్​బాస్​ సీజన్-7.. అప్పుడే ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్​ వీక్ నామినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 8 మంది నామినేట్​ అయ్యారు. మరి ఇందులో హౌస్ నుంచి ఇంటి బాట పట్టేదెవరు..??

bigg boss 7 telugu first week elemination
bigg boss telugu first week elemination
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 5:28 PM IST

Bigg Boss 7 Telugu First Week Elimination: బిగ్ బాస్ తెలుగు-7 సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే.. "బిగ్​బాస్"​ తన ఆట మొదలుపెట్టాడు. 'ఈ సీజన్‌లో అన్నీ ఉల్టా పల్టా' అంటూ ఆడియెన్స్​లో ఆసక్తిని రేకెత్తించి.. ప్రేక్షకులతోపాటు కంటెస్టెంట్స్​కీ షాక్​ ఇచ్చాడు. ఈ సీజన్​లో మొత్తం 14 మంది ఎంట్రీ ఇవ్వగా.. వారందరూ ప్రస్తుతానికి ఇంటి సభ్యులు కాదని.. కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అని డే-3 ఎపిసోడ్‍లో చెప్పాడు. దీంతో.. అందరిలోనూ ఎలిమినేషన్ భయం పట్టుకుంది.

ఆ టైమ్ రానే వచ్చేసింది. ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్-7 ప్రారంభమైతే.. సోమవారం నుంచే ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రెండో రోజు కూడా కొనసాగిన ఈ నామినేషన్ ప్రక్రియ మంగళవారం నాటితో ముగిసింది. హౌస్‌లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ ఈ ప్రక్రియలో పాల్గొనగా.. మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు.

Amardeep Chowdary BiggBoss : పొలిటికల్ ఫ్యామిలీ.. లండన్‌లో స్టడీస్​.. సీరియల్​ హీరో అమర్ ​దీప్​ బ్యాక్​గ్రౌండ్​​ తెలుసా?

వారిలో రతిక, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, షకీల, దామిని, కిరణ్ రాథోడ్ ఉన్నారు. ఇక ప్రియాంక జైన్​, అమర్ దీప్, శివాజీ, ఆట సందీప్, టేస్టీ తేజలను ఎవరూ నామినేట్ చేయకపోవడంతో.. వారు సేఫ్ జోన్‍లో ఉన్నారు. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కు మంగళవారు (సెప్టెంబర్ 5) రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. మిస్డ్ కాల్, హాట్‍స్టార్ యాప్ నుంచి ఓటింగ్ విధానం పెట్టారు. అయితే.. గత ఆరు సీజన్లలో ఒక్కో కంటెస్టెంట్​కు 10 ఓట్లల్లో ఎన్నైనా వేసుకునే అవకాశం ఉండగా.. ఈ సీజన్​లో మాత్రం ఒక కంటెస్టెంట్‍కు ఒక్క ఓటు మాత్రమే వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఇక మంగళవారం స్టార్ట్​ అయిన ఓటింగ్​ ప్రక్రియలో ఎవరూ ఊహించని విధంగా.. రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్‍ ఓటింగ్​లో ముందంజలో ఉన్నాడని సోషల్​ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తర్వాతి స్థానంలో రతిక రోజ్, కార్తీక దీపం ద్వారా పాపులర్ అయిన శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ సేఫ్​ జోన్​లో ఉన్నట్లు చర్చ నడుస్తోంది.

వారి తర్వాతి స్థానంలో షకీల, సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ ఉన్నారట. అయితే.. వీరిలో కిరణ్ రాథోడ్ డేంజర్​ జోన్​లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈవారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నవారిలో ఈమే ఫస్ట్​ ప్లేస్​లో ఉందనే చర్చ కూడా సాగుతోంది. ఓటింగ్​ పరంగానే కాకుండా.. ఆమెకు తెలుగు ఏమాత్రం రాకపోవడం.. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్​లు సైతం అర్థం కాకపోవడం వంటివి ఆమెకు మైనస్‍గా మారనున్నాయనే టాక్​ వినిపిస్తోంది.

అయితే.. శుక్రవారం(సెప్టెంబర్​ 8) వరకూ ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లోనే ఉండటంతో.. హౌజ్​లోని వారి ప్రవర్తన తీరుని బట్టి ఓటింగ్ శాతంలో మార్పులు రావచ్చు. బిగ్​బాస్​లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, అదేవిధంగా.. ఈ సీజన్​ ఉల్టా పల్టా అంటూ మొదలుపెట్టారు కాబట్టి.. ఏమైనా జరగొచ్చు అంటున్నారు. ఒకవేళ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్​ కాకుంటే.. సింగర్ దామిని, షకీలా, ప్రిన్స్ ఈ ముగ్గురిలో ఒకరిపై ఎలిమినేషన్ వేటు పడే అవకాశం ఉందని జోస్యం చెబుతున్నారు. మరి, ఏం జరుగుతుంది? ఇంటికి వెళ్లేది ఎవరు? అనేది చూడాలి.

Bigg Boss Telugu 7: ఆ ఐదుగురికి నాగ్​ లక్షల ఆఫర్.. హీరో కంటెస్టెంట్​ టెంప్ట్​.. ఫైనల్ ట్విస్ట్ సూపర్​ భయ్యా!

Bigg Boss Telugu 7 Contestants : గ్రాండ్​గా సీజన్​ -7 షురూ.. 'కార్తీక దీపం' మోనికా-శివాజీ-షకీలాతో పాటు ఇంకా ఎవరెవరున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.