ETV Bharat / entertainment

'సిల్క్​ స్మితతో అందుకే గొడవ.. బాలయ్యతో షూటింగ్ జరుగుతుండగా...' - ఆలీతో సరదాగా

దాదాపు 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్​ మాస్టర్​గా పనిచేశారు ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్​ మాస్టర్​. 80ల్లో స్పెషల్ సాంగ్స్​తో తెలుగు ప్రేక్షకుల్ని ఓ ఊపుఊపేసింది సిల్క్​ స్మిత. అయితే హీరో బాలకృష్ణ నటించిన ఓ సినిమా షూటింగ్​లో వీరిద్దరి మధ్య ఓ పెద్ద గొడవ హాట్​టాపిక్​గా మారింది. ఇంతకీ ఆ వివాదం ఏంటి? అందుకు కారణాలేంటి?

Alitho Saradaga: Clash between Shivshankar Master and Silk Smita?

author img

By

Published : Jun 28, 2022, 5:57 PM IST

సిల్క్​ స్మితతో గొడవపై స్పందించిన శివశంకర్​ మాస్టర్​

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్​ మాస్టర్​ సుపరిచితమే. దాదాపు 800కుపైగా చిత్రాలకు డ్యాన్స్​ మాస్టర్​గా పనిచేశారాయన. శృంగార గీతాలతో ఒకప్పుడు సినీఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న తార.. సిల్క్​ స్మిత. తన స్టెప్పులతో సినీ అభిమానులను ఉర్రూతలూగించిన స్మిత ఓ దశలో.. శివశంకర్​ మాస్టర్​తో కలిసి పనిచేయడానికి నిరాకరించిందట. బాలకృష్ణ నటించిన 'భలే తమ్ముడు' సినిమాలో ఓ సాంగ్ షూటింగ్​​ కోసం.. శివశంకర్​ మాస్టర్​ చేస్తే చేయనని కరాఖండీగా చెప్పేసిందట. ఈ వ్యవహారంపై ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు శివశంకర్​ మాస్టర్​.

సిల్క్​ స్మిత అంటే తనకు ఇప్పటికీ ఇష్టమేనని.. ఆమెనే తమను దూరంగా పెట్టిందని చెప్పుకొచ్చారు శివశంకర్. ఎస్​.ఎస్​. రవిచంద్ర దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భలే తమ్ముడు సినిమా షూటింగ్​ సమయంలో.. తమ మధ్య విభేదాలు వచ్చాయని అన్నారు.

''బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు సినిమా.. ఎస్​ఎస్​ రవిచంద్ర డైరెక్టర్​. నాలుగు పాటలు చేశాను. అన్నీ సూపర్​గా వచ్చాయి. ఐదో పాట స్మితతో రీహార్సల్స్​ చేశా. చేశాక ఇంటికొస్తుంటే కంపెనీ నుంచి ఫోనొచ్చింది. 'మాస్టర్​గారూ.. మీకు, స్మితకు ఏం గొడవ? మీరుంటే చేయనంటోంది స్మిత.' అని చెప్పారు. 'ఇదేంటి.. నేనుంటే చేయననడం ఏంటీ తెలీదు నాకు అన్నాను.' 'ఆమె ఒకరిని రికమెండ్​ చేస్తుందంట. సరోజ.' అని అనగానే.. మీరే డిసైడ్​ చేయండని పెట్టేశాను. ప్రొడ్యూసర్ అర్జున్​కు ఫోన్​ చేస్తే.. 'ఆయన చిత్రబృందంతో.. మాస్టర్​గారే కావాలి.. ఈ అమ్మాయి చేయకపోతే వేరేవాళ్లను పెట్టండి. బాలయ్య బాబును అడిగి.. రెండు రోజులు ఆలస్యమైనా పర్లేదు.. మాస్టర్​గారు చెప్పినవాళ్లను తీసుకోండి.' అన్నారు. అప్పుడు స్మిత మీద నాకు జాలేసింది. జయమాలినిని పెట్టి ఆ సాంగ్​ తీసేశా. హిట్టయింది. తర్వాత.. నేనే తప్పుకుంటే బాగుండేదనుకున్నా.''

- శివశంకర్​ మాస్టర్​

తన వస్త్రధారణపైనా స్పందించారు శివశంకర్​ మాస్టర్​. ఇలా సంప్రదాయంగా ఉండటమే ఇష్టమని ఆలీతో సరదాగా షోలో చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు కూడా ఇదే ఇష్టమని అన్నారు. సూపర్​స్టార్​ కృష్ణతో ఎక్కువ సినిమాలు చేయడంపైనా మాట్లాడారు శివశంకర్​ మాస్టర్​. అసలు కృష్ణకు కోపమేరాదని చెప్పారు. రాధ అంటే, ఆమె డ్యాన్స్​ అంటే చాలా ఇష్టమని వివరించారు.

ఇవీ చూడండి: 'జబర్దస్త్' అదిరే అభిని మోసం చేసిన ఆ నిర్మాత!

వ్యాంప్‌ పాత్రల్లో జయలలిత ఎందుకు నటించారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.