ETV Bharat / entertainment

25 రోజుల్లో.. 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి'​ కలెక్షన్స్ ఇవే!​ - వీరసింహా రెడ్డి వాల్తేరు వీరయ్య ఎక్కవ కలెక్షన్లు

తెలుగు వారి సినిమా పండగ సంక్రాంతి కానుకగా మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య', నటసింహ బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలు రిలీజై దాదాపు 25 రోజుల పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాల కలెక్షన్లలో జోరు తగ్గింది. ఇప్పటివరకు ఈ సినిమాలు సాధించిన వసూళ్ల వివరాలు ఇవే..

waltair veerayya veerasimha reddy collections

author img

By

Published : Feb 6, 2023, 4:18 PM IST

సంక్రాంతి సినిమా జాతర ముగిసింది. పండగ కానుకగా విడుదలైన పలు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా టాలీవుడ్​ అగ్రతారలు మెగాస్టార్​ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో, నటసింహ బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'తో పండగ బరిలో దిగారు. ఈ రెండు సినిమాలు విడుదలై ఇప్పటివరకు దాదాపు 25 రోజులు పూర్తయ్యాయి. కాగా, సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాల కలెక్షన్లు చివర దశకు వచ్చాయి. దీంతో ఈ చిత్రాల వసూళ్లలో జోరు తగ్గింది. కలెక్షన్ల పరంగా చూస్తే.. 'వీరసింహారెడ్డి' కంటే.. 'వాల్తేరు వీరయ్య' ఎక్కువ వసూళ్ల రాబట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రాలు కలెక్ట్​ చేసిన వసూళ్ల వివరాలు ఇవే..

'వాల్తేరు వీరయ్య' వసూళ్లు..
మెగాస్టార్​ చిరంజీవి మాస్​ ఎంటర్​టైనర్​​ 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్​బస్టర్​గా నిలిచింది. వాల్తేరు వీరయ్య చిత్రం విడుదలై 24 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా, 24వ రోజు రూ. 65లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక, మొత్తంగా 24 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో కలిపి.. ఏరియాల వారిగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం నైజంలో రూ. 35.82 కోట్లు, సీడెడ్​లో రూ. 18.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.06 కోట్లు, ఈస్ట్​లో రూ. 12.90 కోట్లు, వెస్ట్​లో రూ. 7.08 కోట్లు, గుంటూరులో రూ. 9.11 కోట్లు, కృష్ణలో రూ. 7.66 కోట్లు, నెల్లూరులో రూ. 4.57 కోట్లు సాధించింది. మొత్తంగా రూ. 114.39 షేర్, రూ. 185.08 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది 'వాల్తేరు వీరయ్య'.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా చోట్ల కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 'వాల్తేరు వీరయ్య' రూ. 135.77 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా.. రూ. 231.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయట. కాగా, ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్​ రూ. 89 కోట్లు. ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా షేర్ కలెక్షన్స్ రూ. 135 కోట్లు రావడం వల్ల.. రూ. 47 కోట్ల వరకు లాభం సంపాదించింది.

'వీర సింహారెడ్డి' కలెక్షన్లు..
సంక్రాంతి పండగ కానుకగా నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' విడుదలైంది. ఈ సినిమా విడుదలై ఇప్పటివరకు 25రోజులు అయింది. ఈ సినిమా చివరి నాలుగు రోజుల్లో రూ. 26 లక్షల కలెక్షన్స్​ సాధించినట్ల సమాచారం. మొత్తంగా 25 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. నైజాం రూ. 17.31కోట్లు, సీడెడ్ రూ. 16.50 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8.55 కోట్లు, తూర్పు గోదావరి రూ.6.60 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 4.90 కోట్లు, గుంటూరు రూ.7.42 కోట్లు, కృష్ణ రూ. 4.73 కోట్లు, నెల్లూరు రూ. 3.00 కోట్లు వసూలు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 69.01 కోట్లు (రూ.112.25 కోట్లు గ్రాస్)గా ఉంది. కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలు కలిపి రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.77 కోట్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 రోజులు కలిపి చూస్తే.. రూ. 79.63 కోట్లు షేర్ (రూ. 133.55 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయి. ఇకపోతే 74 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా.. 5.63 కోట్ల ప్రాఫిట్ పొందింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.