ETV Bharat / entertainment

సంక్రాంతికి విజయ్ కొత్త సినిమా.. కీలక పాత్రల్లో సీనియర్​ స్టార్స్​! - విజయ్​ వంశీపైడిపల్లి సినిమా సంక్రాంతి

Vijay Vamsipaidipally movie: తమిళ స్టార్ విజయ్​-వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు మరోసారి స్పష్టం చేసింది మూవీటీమ్​. ఈ మూవీలో సీనియర్‌ నటులు ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, ప్రభు, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించింది.

Vijay vamsi paidipally movie
విజయ్ వంశీపైడిపల్లి సినిమా
author img

By

Published : May 9, 2022, 7:20 AM IST

Vijay Vamsipaidipally movie: వచ్చే సంక్రాంతి రిలీజ్​కు లక్ష్యంగా పలు సినిమాలు ముస్తాబవుతున్నాయి. అందులో విజయ్‌ కథానాయకుడిగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. ఇందులో విజయ్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటులు ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, ప్రభు, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారని మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటనలో 2023 సంక్రాంతికే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తైంది. మరో సుదీర్ఘ షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

కాగా, ఇటీవలే విజయ్​ 'బీస్ట్​' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఉగ్రవాద నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. మే 11 నుంచి నెట్​ఫ్లిక్స్​లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్​ కానుంది.

ఇదీ చూడండి: తేదీ మార్చుకున్న నితిన్​.. కాజల్​పై నెటిజన్ల ట్రోల్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.