ETV Bharat / entertainment

విజయ్​-సమంత​.. విక్రమ్​-మురుగదాస్​ కాంబోకు ప్లాన్​! - విక్రమ్​-మురుగదాస్​ కాంబో సినిమా

'మహానటి' తర్వాత విజయ్‌ దేవరకొండ-సమంత జంటగా కలిసి మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మరోవైపు తమిళంలో విక్రమ్​-మురుగదాస్​ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతుందని సినీవర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Vijay samantha Murgadas Vikram movie
విజయ్​-సమంత​.. విక్రమ్​-మురుగదాస్​ కాంబోకు ప్లాన్
author img

By

Published : Apr 19, 2022, 6:37 AM IST

  • Vijaydevarkonda-Samantha movie: విజయ్‌ దేవరకొండ-సమంత జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 'మహానటి' తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిదే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ నెలలోనే సినిమా పట్టాలెక్కనుంది. ఆర్మీ నేపథ్యంలో సాగే కథతో, రొమాంటిక్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో సినిమాని ఆరంభించి, తర్వాత కశ్మీర్‌ పరిసరాల్లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే పేరు ప్రచారంలో ఉంది. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన మేకోవర్‌తో సన్నద్ధమయ్యారు.

Murgadas Vikram movie: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కథానాయకుడు విక్రమ్‌. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. పాత్రలు, కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తున్నా విక్రమ్‌కు సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. ఈ క్రమంలో ఆయన నటించబోయే తదుపరి చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కమర్షియల్‌ కథలకు సందేశం జోడించి తెరకెక్కించటంలో తమిళ దర్శకుడు మురుగదాస్‌ సిద్ధహస్తుడు. ఈ క్రమంలో వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. మురుగదాస్‌ చెప్పిన లైన్‌ విక్రమ్‌కు నచ్చిందట. భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించే సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించనుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులపై మురుగదాస్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరోవైపు విక్రమ్‌ నటిస్తున్న ‘కోబ్రా’ మే 28న విడుదల కానుండగా, మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఇదీ చూడండి: స్వీట్​గా సోనాలీ.. క్యూట్​గా సదా.. హాట్​గా దిశా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.