ETV Bharat / entertainment

విజయ్66 ఫస్ట్​లుక్​ వచ్చేసింది.. టైటిల్​ ఇదే - raksha bandhan 2022

Vijay Thalapathy 66 Movie First Look: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న తలపతి66 ఫస్ట్​లుక్​ వచ్చేసింది. ఈ సినిమాకు 'వారిసు' (వారసుడు) అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్టర్​లో సూట్​ వేసుకొని సీరియస్​ లుక్​ ఇస్తూ స్టైలిష్​గా ఉన్నారు విజయ్.

Thalapathy 66 First Look
vijay 66
author img

By

Published : Jun 21, 2022, 6:18 PM IST

Updated : Jun 21, 2022, 7:21 PM IST

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌- టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. #Thalapathy66 అనే వర్కింగ్‌ టైటిల్‌తో భారీ అంచనాల నడుమ ప్రారంభమైందీ చిత్రం. అప్పటి నుంచీ ఈ సినిమా టైటిల్‌ ఏంటి? ఇందులో విజయ్‌ ఎలా కనిపిస్తాడు? అంటూ అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. జూన్‌ 22న విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం తాజాగా ఆ రెండు కానుకలు అందించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరిష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి 'వారిసు' (తమిళంలో వారసుడు) అనే పేరు ఖరారైంది.

Thalapathy 66 First Look
'వారిసు'లో విజయ్

ఈ పోస్టర్​లో విజయ్‌.. సూటు, బూటు ధరించి బాస్‌ గెటప్పులో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్‌ సరసన రష్మిక నటిస్తోంది. తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదలకానుంది. విజయ్‌ నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రమిదే. ఆయన హీరోగా గతంలో తెరకెక్కిన 'తుపాకి', 'సర్కార్', 'విజిల్‌', 'మాస్టర్‌', 'బీస్ట్‌' తదితర చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది.

'రక్షాబంధన్'​ ట్రైలర్​: అక్షయ్​ కుమార్​, భూమి పెడ్నేకర్ కలిసి నటించిన సినిమా 'రక్షాబంధన్'. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అన్నాచెల్లెల్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ''ప్రిన్స్'​ పోస్ట్​పోన్ కాదు.. రిలీజ్ ఆలస్యమంతే' ​.. ఓటీటీలో 'విక్రమ్​' ఎప్పుడంటే?

Last Updated : Jun 21, 2022, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.