ETV Bharat / entertainment

విజయ్​ 'వారిసు' సెకండ్​ లుక్​.. 'రుద్ర కాళేశ్వరుడు'గా వైష్ణవ్​ తేజ్​ - Vaishnav tej new movie updates

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో విజయ్​ 'వారిసు' సెకండ్​ లుక్​, పంజా వైష్ణవ్​ తేజ్​ కొత్త చిత్రం ప్రకటన వివరాలు ఉన్నాయి.

vijay vaishnav tej
విజయ్ వైష్ణవ్​ తేజ్​
author img

By

Published : Jun 22, 2022, 11:57 AM IST

Updated : Jun 22, 2022, 1:21 PM IST

Vijay Vamsipaidipally movie poster: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌- టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. #Thalapathy66 అనే వర్కింగ్‌ టైటిల్‌తో భారీ అంచనాల నడుమ ప్రారంభమైంది చిత్రం. బుధవారం విజయ్​ పుట్టినరోజు సందర్భంగా .. టైటిల్(వారిసు)​ సహా ఫస్ట్​లుక్​ను విడుదల చేసిన మూవీటీమ్​.. ఇప్పుడు రెండో లుక్​ను కూడా విడుదల చేసింది. ఈ సెకండ్​ లుక్​లో విజయ్​.. పండ్లు, కూరగాయలు ఉన్న ఓ వాహనంలో చిన్న పిల్లల మధ్య స్మైలింగ్​ లుక్​లో అదిరిపోయారు. 'ది బాస్​ రిటర్న్స్ ' అంటూ క్యాప్షన్​ జోడించింది. కాగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరిష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటిస్తోంది. తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి విడుదలకానుంది. విజయ్‌ నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రమిదే. ఆయన హీరోగా గతంలో తెరకెక్కిన 'తుపాకి', 'సర్కార్', 'విజిల్‌', 'మాస్టర్‌', 'బీస్ట్‌' తదితర చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది.

Vaishnav tej new movie: 'ఉప్పెన'తో హీరోగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్‌ తేజ్‌. రెండో ప్రయత్నం.. 'కొండపొలం' చిత్రంతో యువతలో స్ఫూర్తినింపిన ఆయన ప్రస్తుతం 'రంగరంగ వైభవంగా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం విడుదల కాక ముందే మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చేశారు. తాజాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేశారు. ఇంతకముందు ఎప్పుడు చూడని మాస్ రోల్​లో కనిపించబోతున్నట్లు తెలిపారు. "ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు" అంటూ వైష్ణవ్​ గంభీరంగా చెప్పే డైలాగ్​ అదిరిపోయింది. 2023 సంక్రాంతికి రిలీజ్​ చేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుందని పేర్కొన్నారు. కాగా, 'పీవీటీ04'(వర్కింగ్​ టైటిల్​) పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు శ్రీకాంత్​ ఎన్​ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్​. పీడీవీ ప్రసాద్​ సమర్పకులు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​, ఫార్టూన్​ ఫోర్​ సినిమాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ-సాయి సౌజన్య నిర్మాతలు. ఇక వైష్ణవ్​ నటించిన 'రంగరంగ వైభవంగా' గిరీశయ్య దర్శకుడు. కేతికశర్మ హీరయిన్​. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'స్ట్రైక్​ కరెక్ట్​ కాదు.. సినీకార్మికుల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధం'

Last Updated : Jun 22, 2022, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.