ETV Bharat / entertainment

సినిమా రిలీజ్​ రోజే శాశ్వతంగా 'గుడ్ ​బై'.. సీనియర్ నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్​ సీనియర్​ నటుడు అరుణ్​ బాలి(79) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Veteran actor Arun Bali passes away at the age of 79 years in Mumbai

author img

By

Published : Oct 7, 2022, 9:10 AM IST

Updated : Oct 7, 2022, 10:42 AM IST

Arun Bali Passes Away: బాలీవుడ్​ సీనియర్​ నటుడు అరుణ్​ బాలి(79) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 4.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అరుణ్​ బాలి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే ఆయన నటించిన చివరి సినిమా 'గుడ్ ​బై'.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్​ రోజే ఆయన చనిపోవడం చాలా బాధాకరమని పలువురు నెటిజన్లు.. సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

1942లో పంజాబ్​లోని జలంధర్​లో అరుణ్​ బాలి జన్మించారు. బాలీవుడ్​లో అనేక సినిమాల్లో నటించారు. 3 ఇడియట్స్ (2009), పీకే (2014), ఎయిర్‌లిఫ్ట్ (2016), కేదార్‌నాథ్ (2018), పానిపట్ (2019) వంటి చిత్రాలలో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవలే విడుదలైన 'లాల్​సింగ్​ చద్దా' సినిమాలో ఆయన కనిపించారు.

ఇవీ చదవండి: 'లైగర్​' బ్యూటీపై ఆర్యన్​ ఖాన్​కు అంత కోపమా?

'ఆ స్టూడియోలో రికార్డ్‌ చేసిన తొలి ఇండియన్​ మూవీ 'గాడ్​ఫాదర్'​.. ఛాన్స్​ అందరికీ ఇవ్వరు!'

Last Updated : Oct 7, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.