సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న కొత్త చిత్రం 'సైంధవ్'. వెంకీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ నిర్మితమవుతున్నది. ఇది ఆయనకు తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో హీరోయిన్స్ ఎంపికపై దృష్టి పెట్టింది మూవీటీమ్. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. అందులోనూ ఈ చిత్రం పాన్ ఇండియా కావడం వల్ల ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మను తీసుకోవాలని భావిస్తున్నారట. అలాగే మరో ఇద్దరిని సౌత్ ఇండస్ట్రీ నుంచి తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. ఈ మూడు రోల్స్‌కు స్టోరీలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. అలాగని ఇందులో ఏ పాత్ర కూడా వెంకీకి జోడీగా కనిపించదని కూడా సినీ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. గ్యారీ బిహెచ్-కూర్పు, ఎస్.మణికందన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
సవాల్‌గా అనిపించింది.. ఇకపోతే వెంకటేశ్ నటించిన తొలి వెబ్‌సిరీస్ 'రానా నాయుడు'. ఇందులో ఆయన నాగ నాయుడు పాత్రలో నటించారు. అలానే ఇందులో హీరో రానా మరో కీలక పాత్ర పోషించారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పోస్టర్స్ కూడా సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ ఈ సిరీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల్ని తెలిపారు.
"నా వరకు ఇదొక ఇంట్రెస్టింగ్ జర్నీ. డిఫికల్ట్ రోల్స్ నన్నెప్పుడూ ఆకర్షిస్తాయి. ఈ సిరీస్‌లో నా రోల్ కూడా అలాంటిదే. నా రోల్లో నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. కంప్లీట్‌గా భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న ఇలాంటి పాత్రను చేయడం సవాల్‌గా అనిపించింది. కానీ ఎంతో తృప్తినిచ్చింది. ఇందులో నేను, రానా తండ్రీ కొడుకులుగా నటించాం. మా పాత్రలకు జీవం పోయడానికి, మరింత సమర్థవంతంగా రక్తి కట్టించడానికి ఒకరికొకరం సలహాలు, సూచనలు తీసుకున్నాం" అని వెంకీ అన్నారు.
ఇదీ చూడండి: ఎర్ర చీరలో దివి.. ఈ ముద్దుగుమ్మ నడుము మడతలో ఎన్ని సొగసులో