ETV Bharat / entertainment

వెంకీ​ 'సైంధవ్​' కథ రూ.16కోట్ల ఇంజెక్షన్​ చుట్టేనా.. పాప కోసమే పోరాటమా? - Saindhav movie teaser

హీరో విక్టరీ వెంకటేశ్​ 'సైంధవ్​' పేరుతో తన 75వ సినిమాను ప్రకటించారు. 'హిట్' సిరీస్​ డైరెక్టర్​ శైలేష్ కొలనుతో ఈ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్​ కూడా విడుదలైంది. దీని సరిగ్గా చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కథ ఇదే అయిఉండొచ్చని అర్థమవుతోంది.

Venkatesh 75th movie Saindhav movie story line
వెంకీ​ 'సైంధవ్​' కథ రూ. 16కోట్ల ఇంజక్షన్​ చుట్టేనా.. పాప కోసమే పోరాటమా?
author img

By

Published : Jan 26, 2023, 9:41 PM IST

ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేశ్​.. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. 'హిట్‌' లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో 'సైంధవ్​' పేరుతో తన 75వ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్​ ​లుక్స్​ అందరినీ ఆకట్టుకుంటోంది. గ్లింప్స్​ను చూసి అభిమానులు ఎగ్జైట్‌మెంట్‌కు గురవుతున్నారు. వెంకటేశ్​ను స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో చూసి ముగ్ధులవుతున్నారు. రెండు నిమిషాలు ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో వెంకటేశ్​ ఓ చేతిలో గన్‌ పట్టుకుని.. మరో చేతిలో ఓ ఇంజెక్షన్​ పట్టుకుని కనిపిస్తూ 'నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..' అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు.

అయితే, ఈ ప్రచార చిత్రాన్ని తీక్షణంగా చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. చాలా మంది ఈ గ్లింప్స్ చూశాక కమల్ హాసన్ 'విక్రమ్' స్టైల్​లో వెంకీ లుక్​ ఉందని, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా 'విక్రమ్' టెంప్లేట్​ను గుర్తు చేస్తోందని అంటున్నారు. అయితే ఈ గ్లింప్స్​లో గన్​ పట్టుకుంది ఓకే.. మరి ఆ ఇంజెక్షన్​ కథేంటనే అనుమానం వస్తోంది. కథ మొత్తం దాన్ని చుట్టే తిరుగుతున్నట్లుగా అర్థమవుతోంది.

అది రూ.16కోట్ల ఇంజెక్షన్​..
ఈ గ్లింప్స్​లో మొదట వెంకీ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరకు వెళ్తారు. ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంది. దాని కింద Genezo అని రాసి ఉంది. ఇది జన్యువుల మీద పరిశోధనలు చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్! ఆ తర్వాత ఆ బాక్స్​ను ఓపెన్ చేసిన వెంకీ.. లిక్విడ్ ఉన్న ఓ వయల్​ను తీసి చేత్తో పట్టుకుంటారు. దాని మీద onasemnogene abeparvovec అని రాసి ఉంది. దీని గురించి గూగుల్​లో సెర్చ్​ చేస్తే.. SMA (Spine Muscular Atrophy) అనే వ్యాథికి వాడే జీన్ థెరపీ మెడికేషన్ అని తెలిసింది. ఈ మెడిసిన్​ను Zolgensma పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఇంజక్షన్​ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రగ్స్​లో ఒకటి. దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.16కోట్లు. మనం ఈ పేర్లతో గూగుల్ సెర్చ్​ చేస్తే అనేక కథనాలు కూడా వస్తాయి. ఆ మధ్యలో చాలా మంది పసిపిల్లలు ఈ SMA వ్యాధితో పోరాడి కన్నుమూశారు. వారిలో చాలామందికి ఈ Zolgensma ఇంజక్షన్​ను అందించినా ఫలితం దక్కలేకపోయింది. కొంతమంది మాత్రం ఈ ఇంజక్షన్​ ద్వారానే ప్రాణాలతో బయటపడ్డారు.

అసలేంటి ఈ ఎస్‌ఎంఏ..
ఎస్ఎంఏ అనేది ఓ అరుదైన జన్యుపరమైన వ్యాధి. ప్రతి 8 వేల మందిలో ఒకరికి పుట్టినప్పుడే సోకుతుంది. కండరాలు బలహీనపడతాయి. మెదడు నుంచి సంకేతాలు నిలిచిపోతాయి. పిల్లలు మెడ పైకెత్తడం, నడవడం, కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయలేరు. ఆహారమూ సరిగా తీసుకోలేరు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏమై ఉంటుందో..
గ్లింప్స్​లో వెంకటేశ్​ ఈ డ్రగ్​ ద్వారా ఎవరినైనా చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా?.. ఆ చిన్నారి ఆయన కూతురా? ఈ క్రమంలోనే విలన్లతో పోరాడతారా?.. అసలీ కథ ఫాథర్​ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో యాక్షన్​ నేపథ్యంలో తెరకెక్కనుందా? అనేది తెలియాల్సి ఉంది. గ్లింప్స్​లో డైలాగ్ కూడా... 'నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికీ వెళ్లను.. అంటూ ఆ పక్కన చాలా మందిని అప్పటికే వెంకటేశ్ కొట్టి పడేసి ఉంటారు. మరి విషయం ఏంటనేది సినిమా వస్తే గానీ క్లారిటీగా తెలియదు.

అసలు ఎవరీ సైంధవ్?
మహాభారతం ప్రకారం కౌరవుల సోదరి దుస్సల భర్త పేరు సైంధవ్​. అంటే.. దుర్యోధనుడికి బావ. సైంధవుడికి శివుడు నుంచి పొందిన ఓ వరం ఉంటుంది. అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను అడ్డుకోగలిగే శక్తినిస్తాడు. ఆ వరం సాయంతో కౌరవులు.. పాండవులలోని అభిమన్యుడిని పద్మ వ్యూహంలోకి రప్పించి హతమారుస్తారు. ఆ సమయంలో సైంధవుడు.. మిగతా పాండవులని పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాడు. అలా అభిమన్యుడి మరణానికి కారణమవుతాడు సైంధవుడు.

అయితే నెగెటివ్ క్యారెక్టర్ పేరు టైటిల్ రోల్​కు ఎందుకు పెట్టారు? వెంకటేష్ పాత్రలో నెగెటివ్​ షేడ్స్ చూపిస్తారా? లేదా సైంధవుడు అందరికీ ఎలా అయితే అడ్డు పడగలడో? అలా ఎవరినైనా ఎదిరించి అడ్డుపడగలిగే సామర్థ్యం ఉన్నవాడిగా చూపించేందుకు వెంకీకి ఆ పేరు పెట్టారా? అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది.

చంద్రప్రస్థ నగరం..
గ్లింప్స్ మొదట్లోనే నగరం పేరు చెప్పారు డైరెక్టర్ శైలేశ్. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియా గురించి చూపించారు. బైక్ మీద కూడా CP అని ఉంటుంది. అంటే చంద్రప్రస్థ అనే ఈ పోర్ట్.. మహాభారతంలోని ఇంద్రప్రస్థానం నగరానికి రెప్లికా(ఒరిజినల్​కు దగ్గరగా పోలిక ఉంటుంది) అయ్యి ఉండొచ్చు. మహాభారతంలో పాండవులు ఈ ఇంద్రప్రస్థాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు.

మొత్తంగా ఈ గ్లింప్స్​ను ఇలా చాలా ఇంట్రెస్టింగ్​ పాయింట్స్​తో చూపించారు శైలేశ్ కొలను. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్​ నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్​ తర్వాత దర్శకుడు శైలేశ్ ఓ ట్వీట్ చేశారు. "ఇది ట్రిబ్యూట్‌ మాత్రమే కాదు. నేను వెంకటేశ్ గారి కోసమే దర్శకుడిగా మారానని అనిపిస్తుంటుంది. ఆయన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపించాలని ఆశిస్తున్నాను. వెంకటేశ్, ఆయన అభిమానులు గర్వపడేలా శాయశక్తులా శ్రమించి ఈ సినిమా తీస్తా" అని అన్నారు.

ఇక వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.