Varun Tej Lavanya Tripati Wedding : టాలీవుడ్ క్యూట్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ జంట హైదరాబాద్‌లోని ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర షో రూమ్‌లో కనిపించి సందడి చేశారు. చూస్తుంటే ఈ ఇద్దరూ తమ పెళ్లి డ్రెస్ కోసం షాపింగ్ చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
Varun Tej Lavanya Tripathi Marriage Venue : అయితే ఇటలీలోని ఓ ప్రముఖ ఫ్యాలెస్‌లో వరుణ్, లావణ్యల వివాహం జరగనుందని సమాచారం. ఓ చిన్న సెంటిమెంట్ కారణంగా ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వరుణ్, లావణ్యల ప్రేమకు పునాది పడింది ఇటలీలోనేట. ఈ ఇద్దరు జంటగా నటించిన 'మిస్టర్' సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. ఇక షూటింగ్ కోసం కోసం ఇటలీ వెళ్లిన వరుణ్, లావణ్యలు..అక్కడే స్నేహితులయ్యారట. ఆ బంధం కాస్త కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. దీంతో ప్రేమ పుట్టిన చోటో పెళ్లి చేసుకుందామంటూ ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలిసింది. ఇరు కుటుంబాలు కూడా ఈ డెసిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
Varun Tej Lavanya Tripati Wedding Date : ఈ క్రమంలో నవంబరు నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలిసింది. నవంబర్ 1వ తేదీని లాక్ చేసినట్లు తెలిసింది. ఇరు కుటుంబల సమక్షంలో మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లనున్నారట.
Varun Tej Lavanya Tripathi : టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం ఈ ఏడాది జూన్ 9న గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్.. మణికొండలోని నాగబాబు నివాసంలో ఈ వేడుక జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ ఎంగేజ్మెంట్లో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేశారు.
Varun Lavanya Engagement : స్పెషల్ అట్రాక్షన్‌గా ఎంగేజ్మెంట్ రింగ్స్.. ధర తెలిస్తే షాక్!
వరుణ్ సో రొమాంటిక్ అబ్బా.. లావణ్యతో అప్పుడే అలా జరిగిందట!.. ఫోన్లో ఆమె పేరు ఏమని పెట్టారంటే?