Oscar Race RRR Jr.NTR: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ నటన.. భారతీయ ప్రేక్షకులతోపాటు హాలీవుడ్ సినిమా ప్రముఖులను సైతం మెప్పించింది. ముఖ్యంగా పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్, ఇంటర్వెల్ సీన్ అద్భుతమని చెప్పొచ్చు. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆయన నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని హాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి ఏడాది ఆస్కార్స్ ప్రకటించడానికి ముందు ఎవరెవరికి రావచ్చు? అంటూ 'ప్రెడిక్షన్స్' చెప్పడం సహజంగా జరుగుతుండేది. ఉత్తమ నటుడిగా ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారో చెబుతూ... 'వెరైటీ' సంస్థ ఒక లిస్టు వెల్లడించింది. అందులో పోటీ ఇచ్చే హీరోల జాబితాలో ఎన్టీఆర్ పేరు కూడా ఉంది. అయితే... ఎన్టీఆర్ పేరు టాప్ 40లో లేదు. అయితేనేం? ఆయన పేరు లిస్టులో ఉండటం వల్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నెట్టింట తెగ హంగామా చేస్తున్నారు.
-
#Hollywood magazine #Variety mentioned #JrNTR as possible contender for the #Oscars best actor award & #SSRajamouli and #RRR for best director and best film in the unranked category
— Jyoti Chourasiya (@Chourasiajyoti1) August 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
PRIDE OF INDIAN CINEMA NTR#Oscars2023 #NTRGoesGlobal #NTRforOSCARS #NTR𓃵 #NTR #ManOfMassesNTR pic.twitter.com/J1YvfBFuFk
">#Hollywood magazine #Variety mentioned #JrNTR as possible contender for the #Oscars best actor award & #SSRajamouli and #RRR for best director and best film in the unranked category
— Jyoti Chourasiya (@Chourasiajyoti1) August 13, 2022
PRIDE OF INDIAN CINEMA NTR#Oscars2023 #NTRGoesGlobal #NTRforOSCARS #NTR𓃵 #NTR #ManOfMassesNTR pic.twitter.com/J1YvfBFuFk#Hollywood magazine #Variety mentioned #JrNTR as possible contender for the #Oscars best actor award & #SSRajamouli and #RRR for best director and best film in the unranked category
— Jyoti Chourasiya (@Chourasiajyoti1) August 13, 2022
PRIDE OF INDIAN CINEMA NTR#Oscars2023 #NTRGoesGlobal #NTRforOSCARS #NTR𓃵 #NTR #ManOfMassesNTR pic.twitter.com/J1YvfBFuFk
ఆస్కార్స్ లిస్టులో 'ఆర్ఆర్ఆర్' పేరు వినిపించడం ఇది తొలిసారి కాదు.. ఇంతకు ముందు 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో పురస్కారం వచ్చే అవకాశం ఉందని ఒక ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది. డానీ బోయెల్ దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు ఎనిమిది ఆస్కార్స్ వచ్చినప్పుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు? అని సూటిగా ప్రశ్నించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇప్పుడు హాలీవుడ్‌లో 'ఆర్ఆర్ఆర్' ఒక సెన్సేషన్. అక్కడి ప్రముఖులు, ప్రేక్షకులు, విమర్శకులను మన తెలుగు సినిమా విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా 'ఆర్ఆర్ఆర్'కు గూగుల్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' అని సెర్చ్ చేస్తే... సెర్చ్ బార్ కింద గుర్రం, బైక్ వెళుతూ కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్'కు ఉన్న క్రేజ్ గుర్తించడంతో పాటు ఈ విధంగా చేసి చిత్ర బృందాన్ని గౌరవించింది గూగుల్. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
-
🏍 🐎
— DVV Entertainment (@DVVMovies) August 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you @Google for surprising us and acknowledging the the GLOBAL PHENOMENON & Popularity of RRR !! 🤩❤️
Search for RRR in google and post screenshot/video to us with #RRRTakeOver #RRRMovie pic.twitter.com/1Qk3CQSgEy
">🏍 🐎
— DVV Entertainment (@DVVMovies) August 13, 2022
Thank you @Google for surprising us and acknowledging the the GLOBAL PHENOMENON & Popularity of RRR !! 🤩❤️
Search for RRR in google and post screenshot/video to us with #RRRTakeOver #RRRMovie pic.twitter.com/1Qk3CQSgEy🏍 🐎
— DVV Entertainment (@DVVMovies) August 13, 2022
Thank you @Google for surprising us and acknowledging the the GLOBAL PHENOMENON & Popularity of RRR !! 🤩❤️
Search for RRR in google and post screenshot/video to us with #RRRTakeOver #RRRMovie pic.twitter.com/1Qk3CQSgEy
ఇవీ చదవండి: కోట్లలో పెట్టుబడులు పెడుతూ స్టార్టప్‌ల బాటలో సినీ తారలు