ETV Bharat / entertainment

వామ్మో పవన్ కల్యాణ్​ మాస్​ జాతర.. 'ఈ సారి పెర్ఫామెన్స్ బద్దలైపోద్ది' - ustad bhagath singh

Ustad Bhagat Singh Glimpse : పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఉస్తాద్ భగత్​సింగ్​' సినిమా ఫస్ట్​ గ్లింప్స్​ విడుదలైంది. మీరూ చూసేయండి.

ustad bhagath singh fisrt glimps released

author img

By

Published : May 11, 2023, 5:08 PM IST

Updated : May 11, 2023, 6:05 PM IST

Ustad Bhagat Singh Glimpse : పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​, ప్రముఖ దర్శకుడు హరీశ్​ శంకర్​ కాంబినేషన్​లో వస్తున్న సినిమా 'ఉస్తాద్​ భగత్​సింగ్'. యువ నటి శ్రీలీల హీరోయిన్. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. ఫస్ట్​ గ్లింప్స్​ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ గ్లింప్స్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, సరిగ్గా పదకొండేళ్ల క్రితం గబ్బర్​సింగ్​ సినిమా కూడా ఇదే తేదీన విడుదలైంది. ఆ సినిమాకు ఎక్స్​ట్రా డోస్​లా.. 'ఉస్తాద్​ భగత్​సింగ్​'ను తెరకెక్కించారు హరీశ్​ శంకర్​. ఇక, ఈ గ్లింప్స్​నకు​ బాక్స్​లు బద్దలైపోయే మ్యూజిక్​ ఇచ్చారు 'రాక్​ స్టార్​' దేవీశ్రీ ప్రసాద్​.

'ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో.. అధర్మము వృద్ధినొందునో.. ఆయా సమయముల యందు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను' అంటూ ఘంటసాల గీతా సారము చెబుతుండగా.. 'భగత్​.. భగత్​సింగ్​. మహంకాళి పోలీస్​ స్టేషన్​. అత్తర్​ గంజ్​.. పాతబస్తీ' అంటూ ధర్మ రక్షుకుడి అవతారములో అదరగొట్టారు పవన్​ కల్యాణ్​. లుంగీ కట్టి నిలువు బొట్టు పెట్టి.. ఊర మాస్​ గెటప్​లో పవన్ కనిపించారు. పవర్​ స్టార్​ ఈ సినిమాలో ఎస్​ఐ పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్​లో ఓ సీన్​లో పోలీస్​ స్టేషన్​లో కోపంతో ఊగిపోయారు. దీంతో ఈ సినిమాలో ఇంటెన్స్​ యాక్షన్​ సీన్స్​ ఉంటాయని తెలుస్తోంది. 'గబ్బర్​ సింగ్​'కు ఎక్స్​ట్రా డోస్​లా ఈ సినిమా ఉండే అవకాశముంది. ఈ మేరకు గ్లింప్స్​ చూస్తే అర్థమవుతుంది. చివర్లో పవన్​ చెప్పిన డైలాగ్​ ఈ గ్లింప్స్​కే హైలైట్​గా నిలిచింది. 'ఈ సారి పెర్ఫామెన్స్ బద్దలైపోద్ది.. సాలా' అంటూ పవన్​ చెప్పిన ఊర మాస్​ డైలాగ్​ ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పించింది. ఇదే కాకుండా, ఈ మధ్య వచ్చిన పవన్​ సినిమాల కన్నా.. ఈ చిత్రంలో ఆయన మరింత స్టైలిష్​గా కనిపిస్తున్నారు.

ఈ గ్లింప్స్​ విడుదల చేయడానికి మేకర్స్ ఓ ఈ వెంట్​ను ఏర్పాటు చేశారు. దాని సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో ఉన్న సంధ్య థియేటర్లో వద్దకు పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. బ్యాండుతో ఉర్రూతలూగించారు. అభిమానుల కోలాహలం మధ్య ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్​ అయింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇటీవల వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయనకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా ఉండగా..చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : May 11, 2023, 6:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.