ETV Bharat / entertainment

కేజీయఫ్​ రేంజ్​లో మరో భారీ సినిమా.. హీరో ఎవరంటే? - కబ్జా మూవీ డైరెక్టర్​

ఇండియన్​ ప్రేక్షకులను అలరించేందుకు కేజీయఫ్​ తరహాలో మరో భారీ సినిమా రిలీజ్​కు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. హీరో ఎవరంటే?

kabzaa teaser
కబ్జా టీజర్​
author img

By

Published : Sep 17, 2022, 8:51 PM IST

కన్నడ ఇండస్ట్రీ నుంచి 'కేజీయఎఫ్​' తరహాలో మరో భారీ సినిమా రాబోతుంది. దాని పేరే 'కబ్జా'. తాజాగా ఈ చిత్ర తెలుగు టీజర్​ను విడుదల చేయగా, నెటిజన్లను అది ఆకట్టుకుంటోంది. కాకపోతే ఇది కూడా అచ్చం కేజీయఎఫ్​లానే అనిపిస్తోందని అనుకుంటున్నారు.

ఉపేంద్ర.. 90ల్లో ఈ పేరు సెన్సేషన్​. అప్పట్లో భిన్నమైన పాత్రలు, సినిమాలతో అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన చెరగని ముద్ర వేశారు. రియాల్​ స్టార్​గా ఇమేజ్​ను సంపాదించుకున్నారు. తెలుగలోనూ సన్​ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోయిన్​ నిత్యామేనన్ అన్నయ్య పాత్రలో కీలక పాత్ర పోషించారు. అయితే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న ఆయన త్వరలో ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్ చేసేందుకు కబ్జాతో వస్తున్నారు. ఈ టీజర్​లోని ప్రతి సీను, ప్రతీ షాట్ చూస్తుంటే కేజీఎఫ్ చిత్రమే కళ్లముందు మెదలాడుతోంది. 1942 సమయంలో ఓ ఇండియన్ గ్యాంగ్ స్టర్ ప్రయాణమే 'కబ్జా' కథ. ఈ సినిమా డైరెక్టర్ ఆర్.చంద్రు.

ఇక ఇటీవలే విక్రాంత్​ రోణాతో ప్రేక్షకులను పలకరించిన కిచ్చా సుదీప్.. ఈ భారీ మూవీలో​ కీలక పాత్ర పోషించారు. మరో ముఖ్య పాత్రలో శ్రియ నటిస్తోంది. మరి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్​ను అందుకుంటుందో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రూ.వెయ్యి కోట్లతో శంకర్ సినిమా.. సూర్య-యశ్​లలో ఆఫర్​ ఎవరికి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.