ETV Bharat / entertainment

ఫ్లైట్​ నుంచి దూకేస్తూ ఫ్యాన్స్‌కు టామ్ క్రూజ్ 'స్పెషల్ థాంక్స్'.. వీడియో చూస్తే.. - టామ్​ క్రూజ్​ వార్తలు

టామ్ క్రూజ్.. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ స్టార్ హీరో చేసిన విన్యాసాన్ని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ ఆయన చేసిన పనేంటో ఇప్పుడు చూడండి.

tom cruise news
tom cruise news
author img

By

Published : Dec 19, 2022, 6:00 PM IST

హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్ సినిమాలు ఏ రేంజ్​లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడం తనకు తానే సాటి. అనితరసాధ్యమైన స్టంట్స్ చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా సోషల్ మీడియా వేదికగా షాకింగ్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మరోసారి నోరెళ్లబెట్టారు.

టామ్ తాజాగా నటించిన సినిమా 'టాప్ గన్: మేవరిక్'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పేందుకు.. ఏకంగా గాల్లో ఎగురుతున్న విమానంలో నుంచి కిందకు దూకారు. తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్ కోసం ఈ స్టంట్ చేస్తున్నట్లు తెలిపారు. టాప్ గన్ మేవరిక్​ను ఆదరించిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పకుండా ఈ ఏడాదిని కంప్లీట్ చేయలేనని చెప్పారు. సాహసోపేతమైన ఆ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

టామ్ నటించిన 'టాప్ గన్ మేవరిక్' చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత కష్టాల్లో ఉన్న హాలీవుడ్​కు ఈ చిత్రం మంచి ఊపును అందించింది. ఈ సినిమా విజయానికి సహకరించిన ఫ్యాన్స్​కు ఆయన చాలా సార్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఈ అద్భుత వీడియోను షేర్ చేసి మరోసారి ధన్యవాదాలు చెప్పారు. త్వరలో మరో సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.