ETV Bharat / entertainment

తారల ఇంట చవితి పండుగ ఎలా జరుగుతుందంటే..!

గణపయ్య పండుగ వచ్చిందంటే చాలు అందరి ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది. బుజ్జి గణపతి నుంచి పెద్ద గణపతుల వరకు అన్ని రూపాల్లో దర్శనమిచ్చే ఆ దేవదేవుడ్ని చూసేందుకు వెయి కన్నులు చాలవు. ఆ తొమ్మిది రోజులూ ఇక ఊరూ వాడా సంబరాలు చేసుకుంటారు. విభిన్నమైన రూపాల్లో కనిపిస్తూ సందడి చేసే గణనాథులు.. పచ్చతోరణాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో తళుక్కుమనే వినాయక మండపాలు.. ఆ వేదికల వద్ద బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి చేసే అల్లర్లు.. సాయంత్రం వేళ అక్కడ జరిగే డ్యాన్సులు, పాటల వేడుకలు.. వినాయక చవితి పండగ పేరెత్తగానే గుర్తొచ్చే జ్ఞాపకాలెన్నో. అలాంటి జ్ఞాపకాలను మనతో పంచుకునేందుకు వచ్చారు మన సినీతారలు..

author img

By

Published : Aug 31, 2022, 7:13 AM IST

STARS ON GANESH CHATURTHI
STARS ON GANESH CHATURTHI

విభిన్నమైన రూపాల్లో కనిపిస్తూ సందడి చేసే గణనాథులు.. పచ్చతోరణాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో తళుక్కుమనే వినాయక మండపాలు.. ఆ వేదికల వద్ద బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి చేసే అల్లర్లు.. సాయంత్రం వేళ అక్కడ జరిగే డ్యాన్సులు, పాటల వేడుకలు.. వినాయక చవితి పండగ పేరెత్తగానే గుర్తొచ్చే జ్ఞాపకాలెన్నో. అవన్నీ నిజాలై సాక్ష్యాత్కరించే వేడుక రోజులు వచ్చేశాయి. 'బోలో గణేష్‌ మహరాజ్‌కీ.. జై' అంటూ ఊరూ వాడా గణనాథుడి నామస్మరణతో మారుమోగిపోయే ఘడియలు నడిచొచ్చాయి. ఇందుకు సినీ తారల లోగిళ్లూ మినహాయింపు కాదు. బొజ్జ గణపయ్య పండగతో వారికీ ప్రత్యేక జ్ఞాపకాలుఉన్నాయి. ఆ అపురూప జ్ఞాపకాల్ని కొందరు తారలు ఇలా పంచుకున్నారు.

గల్లీ గల్లీ తిరిగా..
"వినాయక చవితి పండగతో నాకు బోలెడన్ని జ్ఞాపకాలున్నాయి. గణేష్‌ మండపాల్ని చూడటం కోసం బైక్‌పై హైదరాబాద్‌లో గల్లీ గల్లీ తిరిగిన రోజులు గుర్తొస్తాయి. మా ఇంట్లో వినాయక పూజ అమ్మ చేతుల మీదుగానే జరిగేది. ఆ పూజ పూర్తి కాగానే గణేష్‌ మండపాల సందర్శనకు మా మామయ్యలతో కలిసి బైక్‌పై వెళ్లే వాడ్ని. ఖైరతాబాద్‌ పెద్ద వినాయకుడి నుంచి వీధుల్లో పెట్టిన చిన్న చిన్న గణపతుల వరకు అన్ని ప్రతిమల్ని చూసొచ్చే వాళ్లం. ఇక సాయంత్రం అయ్యిందంటే కాలనీల్లో మండపాల దగ్గర చేసే డ్యాన్సులు, పాటల వేడుకల్ని చూసేందుకు వెళ్లే వాళ్లం. నిజానికి నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ప్రసాదాల కోసమే గణనాథుని మండపాల దగ్గరకు వెళ్లే వాడ్ని. కొంచెం పెద్దయ్యాక విగ్రహాల్ని చూడటం కోసం వెళ్తుండేవాడ్ని. ఇక ఇప్పుడు పండగని పిల్లలతో కలిసి ఇంట్లోనే చక్కగా జరుపుకొంటున్నాం".

- ఎన్టీఆర్‌

పూజలో ఆ పుస్తకాలు
"మా ఇంట్లో వినాయక చవితికి చాలా సందడిగా ఉంటుంది. చిన్నప్పుడు నేనే స్వయంగా అమీర్‌పేటకు వెళ్లి మట్టి గణపతిని, పూజా సామగ్రిని తీసుకొచ్చేవాడ్ని. ఈ పండగ రోజు ‘విఘ్నాలు తొలగించు స్వామి’ అంటూ అందరూ వినాయకుడ్ని వేడుకుంటారు కదా. అందుకే నేను నాకు కష్టమైన సబ్జెక్ట్‌ పుస్తకాలన్నీ తీసుకొచ్చి పూజలో పెట్టే వాడ్ని. నాన్న ఆ పుస్తకాలపై స్వస్తిక్‌, ఓం అని రాసిస్తే.. నేను మళ్లీ వాటిని పసుపుతో స్వయంగా దిద్దుకునే వాడ్ని. ఇంకా బెటర్‌ రిజల్ట్‌ వస్తుందేమోనని ఆశన్నమాట".

- నాని

ఈ రోజు చేసే బూరెలు ఇష్టం..
"వినాయక చవితి వేడుకల గురించి సినీ ఇండస్ట్రీలోకి వచ్చాకే నాకు బాగా తెలిసింది. ఎందుకంటే మా పంజాబీ ఫ్యామిలీల్లో గణేష్‌ చతుర్థిని అంతగా జరుపుకోరు. కాబట్టి చిన్నతనంలో పండగతో పెద్దగా జ్ఞాపకాలు లేవు. ఇక చిత్ర సీమలోకి వచ్చాక సెట్లో జరిగిన వేడుకల్లోనూ.. మేమున్న కాలనీల్లో జరిగే ఉత్సవాల్లోనూ చాలాసార్లు పాల్గొన్నా. అయితే గణేష్‌ చతుర్థి పండగ అనగానే నాకు బాగా గుర్తొచ్చేది ముంబయి. అక్కడ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుతారు. నిమజ్జన కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. అక్కడ నాకొక ఫ్రెండ్‌ ఉంది. తను ఉండే కాలనీలో ఏటా వినాయకుడ్ని పెట్టేవారు. నేను వాళ్ల ఇంటికి వెళ్లి వేడుకల్లో పాల్గొనేదాన్ని. చాలా సరదాగా అనిపించేది. పండగ రోజు చేసే బూరెలు అంటే నాకు చాలా ఇష్టం"

- రకుల్‌ప్రీత్‌ సింగ్‌

సందడే సందడి..
"గణేష్‌ చతుర్థి అనగానే నాకు మా కాలేజీ రోజులే గుర్తొస్తాయి. మా ఫ్రెండ్స్‌, మిగతా విద్యార్థులంతా కలిసి, గ్రూప్‌గా ఏర్పడి.. చందాలు వసూలు చేసి కాలేజీలోనే వినాయక మండపాన్ని ఏర్పాటు చేసే వాళ్లం. చక్కగా రంగురంగుల కాగితాలతో అలంకరించేవాళ్లం. గణపతి ప్రతిమను నిమజ్జనం చేసే వరకు మేమంతా అక్కడే గడిపే వాళ్లం. రోజూ డ్యాన్సులు, పాటలతో చాలా సరదాగా ఎంజాయ్‌ చేసే వాళ్లం. నిజంగా ఆరోజులు భలేగా ఉండేవి"

- రష్మిక

ఇదీ చదవండి: పవన్​ కల్యాణ్ 'జల్సా' రీరిలీజ్.. కొత్త ట్రైలర్ ఇదిగో..

ఈ వారమే విక్రమ్​ కోబ్రా, ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.