ETV Bharat / entertainment

'దిల్ ​రాజు గారూ.. మాకూ ఛాన్స్​ ఇవ్వండి.. ఆ సినిమాను వాయిదా వేయండి' - శాకుంతలం సినిమా విడుదలను పోస్ట్​పోన్​ చేయండి బన్నీ

టాలీవుడ్​లో సినిమాల విడుదలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్​ చిత్ర పరిశ్రమలో హాట్​ టాపిక్​గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Bunny Vasu Met Dil Raju
Bunny Vasu Dil Raju
author img

By

Published : Jan 10, 2023, 1:53 PM IST

తెలుగు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు టాలీవుడ్​ సినిమా పెద్దలపై ఘాటైన కామెంట్స్​ చేశారు. సినిమా విడుదల తేదీల విషయంలో కొత్త వారికీ వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ముఖ్యమైన తేదీలను చిన్న సినిమాలకు వదిలిపెట్టాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్​రాజును కలిసిన ఆయన శాకుంతలం సినిమా విడుదల తేదీపై పునరాలోచించాలని అడిగారు.

బన్నీ వాసు కామెంట్స్​..
'తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఓ పెద్ద పండుగ. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయికి వెళ్లగలుగుతున్నాయి. తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది సరైన నిర్ణయమే. కానీ పెద్ద సినిమాల నిర్మాతలు చిన్న సినిమాల గురించి కూడా కాస్త ఆలోచించాలి. కొత్త నిర్మాతలు, దర్శకులకు సినిమాల విడుదల తేదీలు చాలా ముఖ్యం. గతంలో కొత్తవాళ్లకు కూడా ఒక అవకాశం ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రత్యేక సందర్భం, సెలవులు ఉంటే తప్ప చిన్న సినిమాలకు ఆదాయం రావడం లేదు. వందల సినిమాలు విడుదల చేస్తే అందలో పది మాత్రమే హిట్ అవుతున్నాయి. రిలీజ్​ అవుతున్న వాటిలో యావరేజ్​ సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. యావరేజ్ సినిమాలు తీసే వాళ్లలో కొత్తవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. చిన్న సినిమాల విడుదల కోసం కొత్త వాళ్లకు మూడు సెలవులు వదిలేస్తే గొప్ప సహాయం చేసినవాళ్లం అవుతాం. ఈ విధంగా కొత్తవాళ్లను ప్రోత్సహిస్తేనే సినీ పరిశ్రమ భవిష్యత్ బాగుంటుంది. దీంతో తెలుగు సినిమా కొత్త ఒరవడికి నాంది పలకాలని కోరుకుంటున్నాను' అని బన్నీ వాసు పేర్కొన్నారు.

'ఈ విషయంపై సినిమా పెద్దలు దృష్టి పెట్టాలి. పొరుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఇలాంటి పరిస్థితే వస్తే ఎలా ఉంటుంది? సినిమాల విషయంలో ఎక్కువ, తక్కువ చేసి మాట్లాడకూడదు. దీనిపై నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి మాట్లాడాను. ఫిబ్రవరి 17న సార్, దమ్కీ, వినరోభాగ్యము విష్ణుకథా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అనూహ్యంగా శాకుంతలం విడుదల తేదీని అదే రోజున దిల్ రాజు ప్రకటించారు. దిల్ రాజు పెద్ద మనసు చేసుకొని శాకుంతలం రిలీజ్​ తేదీపై పునరాలోచించాలని కోరాను' అని బన్నీ వాసు వెల్లడించారు.

అల్లు అరవింద్‌తో కలిసి స్థాపించిన నిర్మాణ సంస్థ జీఏ2 కంపెనీలో బన్నీ వాసు భాగస్వామిగా ఉన్నారు. ఆయన భలేభలే మగాడివోయ్​, గీతా గోవిందం వంటి హిట్​ సినిమాలను టాలీవుడ్​కు అందించారు. ఆయన సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలేభలే మగాడివోయ్​, చావు కబురు చల్లగా వంటి సినిమాలనూ నిర్మించారు. తాజాగా ఈయన నిర్మించిన చిత్రం వినరోభాగ్యము విష్ణుకథా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.